మాజీ ముఖ్యమంత్రికి తెలంగాణ బాధ్యతలు- రాహుల్ నిర్ణయం వెనుక..!?
తెలంగాణ కేంద్రంగా కీలక నిర్ణయాలు జరుగుతున్నాయి. అటు కాంగ్రెస్.. ఇటు బీజేపీ తెలంగాణ పైన ప్రత్యేకంగా ఫోకస్ చేసాయి. అందులో భాగంగా కొత్త కార్యాచరణ ఖరారు చేస్తున్నాయి. ఇప్పటి కే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తవుతోంది. దీంతో.. వచ్చే ఎన్నికలే లక్ష్యంగా తాజా వ్యూహాలతో బరిలోకి దిగుతున్నాయి. అందులో భాగంగా తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జ్ గా మాజీ సీఎం కు బాధ్యతలు అప్పగించేందుకు రంగం సిద్దమైనట్లు తెలుస్తోంది.
తెలంగాణ పైన రాహుల్ గాంధీ ప్రత్యేకంగా ఫోకస్ చేసారు. తిరిగి అధికారం దక్కించుకోవాలనే పట్టుదలతో ఉన్నారు. అందులో భాగంగా రాష్ట్ర వ్యవహారాల పైన నిరంతరం ఆరా తీస్తున్నారు. ఇక, రాష్ట్ర పార్టీ ఇంఛార్జ్ గా ఉన్న మీనాక్షి నటరాజన్ తర్వాత ఎవరు ఇన్ ఛార్జి గా వస్తారన్న దానిపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతుంది. అయితే ఆమె ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లారు. కొత్త ఇన్చార్జ్ నియామకంపై కాంగ్రెస్ హైకమాండ్ కసరత్తు చేస్తోంది. అందు లో భాగంగా మాజీ సీఎం.. సీనియర్ నేత కు తెలంగాణ బాధ్యతలు ఇవ్వాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. రాజస్థాన్ మాజీ సీఎం గెహ్లాట్ పేరును పార్టీ అధిష్ఠానం ప్రధానంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. అపార రాజకీయ అనుభవం ఉన్న గెహ్లాట్ వైపే పార్టీ అగ్రనాయకత్వం మొగ్గు చూపుతున్నట్లు ఢిల్లీ నేతల సమాచారం.

రాహుల్ గాంధీ స్ఫెషల్ ఫోకస్
తెలంగాణ లో పూర్తిగా సీఎం రేవంత్ - మహేష్ గౌడ్ ప్రభుత్వం .. పార్టీ వ్యవహారాలను ముందుండి నడిపిస్తున్నారు. ఇక, త్వరలో తెలంగాణలో ఖైరతాబాద్ ఉప ఎన్నికతో పాటుగా గ్రేటర్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ టైం లో రాష్ట్రంలో పార్టీని మరింతగా బలోపేతం చేయటంతో పాటుగా పీసీసీ - మధ్య మరింత సమన్వయంతో జిల్లాల వారీగా పార్టీకి బలం పెరిగేలా నియామకాలు.. నిర్ణయాలు ఉండాలని నిర్ణయించారు. ఈ మేరకు ఇప్పటికే కసరత్తు కొనసాగుతోంది. ఈ సమయంలో మాజీ సీఎం గెహ్లాట్ కు తెలంగాణ పార్టీ ఇంఛార్జ్ బాధ్యతలు అప్పించాలని కాంగ్రెస్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. డిసెంబర్ 7వ తేదీకి రేవంత్ సీఎంగా బాధ్యతలు చేపట్టి మూడేళ్ల కాలం పూర్తి కానుంది. దీంతో.. వచ్చే రెండేళ్ల కాలంలో అమలు చేయాలని వ్యూహాలు.. ప్రణాళికల పైన పూర్తి స్థాయిలో ఫోకస్ చేయనున్నారు. త్వరలోనే కొత్త ఇంఛార్జ్ పేరును అధికారికంగా ప్రకటన చేసే ఛాన్స్ కనిపిస్తోంది.













Click it and Unblock the Notifications
