నేడు తెలంగాణకు రాహుల్ గాంధీ.. కీలక భేటీ !

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేడు తెలంగాణకి రానున్నారు. గత పది రోజులుగా వికారాబాద్‌ జిల్లా అనంతగిరిలోని హరిత రిసార్ట్స్‌లో జరుగుతున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల జిల్లా కాంగ్రెస్‌ కమిటీ (డీసీసీ) అధ్యక్షుల శిక్షణా శిబిరం ముగింపు కార్యక్రమానికి ఆయన హాజరు కానున్నారు. శిక్షణ తీసుకున్న డీసీసీ అధ్యక్షులకు పార్టీ సంస్థాగత నిర్మాణం, వారి విధులు, పార్టీ ఆలోచనల గురించి దిశానిర్దేశం చేయనున్నారు. అక్కడే రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సభ్యులను కలవనున్న రాహుల్‌ వారితో ఫొటో సెషన్‌లో పాల్గొననున్నారు. కాగా డీసీసీ అధ్యక్షుల కుటుంబ సభ్యులను కూడా ఈ శిబిరానికి ఆహ్వానించారు. ఏపీ నుంచి 41 మంది, తెలంగాణ నుంచి 36 మొత్తంగా 77 మంది డీసీసీ అధ్యక్షులు శిక్షణా శిబిరంలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో రాహుల్ గాంధీతో పాటు సీఎం రేవంత్‌ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీనియర్‌ మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పాల్గొననున్నారు. అలానే పీఏసీ సభ్యులు, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్‌ మహేశ్‌ గౌడ్ సహా పలువురు ముఖ్య నేతలు కూడా హాజరు అవుతారని సమాచారం.

rahul-gandhi-will-attendtraining-camp-for-dcc-presidents-of-telangana-and-andhra-pradesh-states

రాహుల్‌ షెడ్యూల్‌..

పీసీసీ వర్గాలు వెల్లడించిన షెడ్యూల్‌ ప్రకారం ఉదయం 7:10 గంటలకు ఢిల్లీ నుంచి బయలుదేరనున్న రాహుల్‌గాంధీ 9:20 నిమిషాలకు శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకుంటారు.

సీఎం, డిప్యూటీ సీఎం, పీసీసీ చీఫ్‌లతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రొటోకాల్‌ సలహాదారు హర్కర వేణుగోపాల్‌రావు, మంత్రులు, పార్టీ నేతలు స్వాగతం పలుకుతారు.

అక్కడి నుంచి ఉదయం 9:40 గంటలకు హెలికాప్టర్‌లో బయలుదేరనున్న రాహుల్‌గాంధీ 10 గంటలరే వికారాబాద్‌కు వచ్చి అక్కడి నుంచి రోడ్డు మార్గంలో హరిత రిసార్ట్‌కు చేరుకుంటారు.

సాయంత్రం 4:30 గంటల వరకు శిక్షణ శిబిరంలో ఉంటారు.

తిరిగి హెలికాప్టర్‌లో శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకుని 5:30 గంటలకు ఢిల్లీ వెళ్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+