• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

తెలంగాణలో కాంగ్రెస్ తరపున మెగాస్టార్ ప్రచారం..?

|
  కాంగ్రెస్ తరపున ప్రచారం చేయనున్న మెగాస్టార్..!

  కేంద్ర మాజీ మంత్రి మెగాస్టార్ చిరంజీవి తెలంగాణకు జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ప్రచారం చేస్తారా..? ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్న చిరు... ఎన్నికల సమయానికి మళ్లీ కాంగ్రెస్‌లో జోష్ నింపేందుకు నడుంబిగిస్తారా...? తెలంగాణలో చిరంజీవి స్టార్ క్యాంపెయినర్‌గా అవతరిస్తారా...? అంటే ఔననే సమాధానం వినిపిస్తోంది. చిరంజీవి ప్రస్తుతం తన చారిత్రాత్మక చిత్రం సైరా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. దేశస్వాతంత్ర్యం కోసం పోరాటంలో భాగంగా తిరుగుబాటు జెండా ఎగురవేసిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో ఈ చిత్రం తెరకెక్కుతోంది.

  కాంగ్రెస్‌కు కనిపిస్తున్న స్టార్ క్యాంపెయినర్ చిరంజీవి

  కాంగ్రెస్‌కు కనిపిస్తున్న స్టార్ క్యాంపెయినర్ చిరంజీవి

  ప్రస్తుతం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణకు స్టార్ క్యాంపెయినర్‌గా ఉన్నారు. మరి ఆస్థాయిలో కాంగ్రెస్‌కు స్టార్ క్యాంపెయినర్‌గా రెండు తెలుగు రాష్ట్రాల్లో అభిమానులున్న చిరంజీవి మాత్రమే కాంగ్రెస్ అధిష్టానానికి కనిపిస్తున్నారు. ఈ క్రమంలోనే స్వయంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చిరంజీవిని ప్రచారం చేయాల్సిందిగా కోరే అవకాశం కనిపిస్తోందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఇందుకు కారణం తెలంగాణలో ఎన్నికలను కాంగ్రెస్, రాహుల్ గాంధీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ఏ ఒక్క చిన్న అవకాశాన్ని కూడా వదులుకునేందుకు కాంగ్రెస్ సిద్ధంగా లేదు. అందివచ్చిన అన్ని అవకాశాలను వినియోగించుకుని ప్రభుత్వంలోకి రావడమే ధ్యేయంగా పావులు కదుపుతోంది. ఇందులో భాగంగానే ప్రధాన శతృవైన టీడీపీతో, కమ్యూనిస్టులతో జతకట్టింది కాంగ్రెస్.

  చిరంజీవి ప్రచార బాధ్యతలు చేపట్టాలంటున్న సీనియర్లు

  చిరంజీవి ప్రచార బాధ్యతలు చేపట్టాలంటున్న సీనియర్లు

  ఇదిలా ఉంటే చిరంజీవి ఎలాగైనా ప్రచారం చేసేలా చూడాలని తెలంగాణలోని కాంగ్రెస్ సీనియర్ నేతలు అధిష్టానంపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఇదిలా ఉంటే కర్నాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో చిరును ప్రచారం చేయాల్సిందిగా కోరగా... ఆయన సున్నితంగా తిరస్కరించారు. అయితే ఈ సారి ఆయన ప్రచారం నుంచి తప్పించుకునే అవకాశం లేదు. ఎందుకంటే చిరంజీవి తెలంగాణలోనే ఉంటున్నారు కాబట్టి పార్టీ కోసం బాధ్యతలు చేపడుతారనే విశ్వాసం పార్టీ సీనియర్ నేతలు వ్యక్తం చేస్తున్నారు.

  చిరంజీవి సభకు 41వేలమంది వచ్చారు

  ఎంతమంది చిరంజీవులు వచ్చినా.. కారుస్పీడుకు బ్రేక్ వేయలేరు

  ఎంతమంది చిరంజీవులు వచ్చినా.. కారుస్పీడుకు బ్రేక్ వేయలేరు

  కేసీఆర్‌ను ఢీకొట్టాలంటే ఇప్పటికే టీడీపీ, సీపీఐ. తెలంగాణ జనసమితి,సీపీఎంలతో కాంగ్రెస్ జతకట్టినప్పటికీ... పార్టీ క్యాంపెయినింగ్‌లో తమ స్టార్ క్యాంపెయినర్‌గా చిరంజీవి ఉంటేనే మంచి ఫలితాలు రాబట్టొచ్చనే ఆశలో హస్తం పార్టీ ఉంది. ఇప్పుడు బంతి చిరంజీవి కోర్టులో ఉంది. అయితే ఓవైపు తన సినిమా షూటింగ్ మరోవైపు ప్రచార బాధ్యతలు ఎలా నిర్వర్తిస్తారనేది వేచి చూడాలి. ఇదిలా ఉంటే కేసీఆర్ వాక్చాతుర్యం, పదునైనా పదాలు, ఎమోషనల్ స్పీచ్‌ల ముందు చిరంజీవి తన ప్రసంగంతో ఆకట్టుకుంటారా అనే అనుమానం రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవికి స్టార్ డమ్ ఉండొచ్చు కానీ అది తెలంగాణలో కేసీఆర్ ముందు దిగదుడుపే అని ఎంతమంది చిరంజీవులు వచ్చినా... కారు స్పీడుకు బ్రేకు వేయలేరని గులాబీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Chiranjeevi might be busy with his dream project Sye Raa Narasimha Reddy, the historic biopic of India's first civil rebellion Uyyalawada Narasimha Reddy and is working on deadlines to release the film for Summer in multiple languages, but the election atmosphere may put his plans off.Rahul Gandhi may personally call and seek Chiru's help in the coming Telangana Assembly elections which Rahul & Co are taking it very prestigious and seriously.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more