అన్నే బెస్ట్ లీడర్.. కాంగ్రెస్ అభ్యర్ధికి టాలీవుడ్ స్టార్ సపోర్ట్ !!
తెలంగాణలో మళ్లీ పొలిటికల్ హీట్ పెరిగింది. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా ఉన్న మాగంటి గోపీనాథ్ ఇటీవల అనారోగ్యంతో కన్నుమూయడంతో ఉపఎన్నిక నిర్వహిస్తున్నారు. ఈ ఎన్నికను అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు ఈ ఉప ఎన్నికను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. తమ అభ్యర్ధి విజయం కోసం అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. కాగా ఇప్పటికే ఆయా పార్టీలు అభ్యర్ధులను ప్రకటించడం.. నామినేషన్లు వేయడం చకచకా జరిగిపోయాయి. ఉప ఎన్నికకు సమయం దగ్గరపడుతుండడంతో అధికార, ప్రతిపక్ష పార్టీలన్నీ ప్రచారం పర్వంలో దూకుడుగా ముందుకు సాగుతున్నారు.
కాగా ఈ ఉప ఎన్నిక బరిలో బీఆర్ఎస్ నుంచి గోపీనాథ్ భార్య మాగంటి సునీతకు పార్టీ అధినేత కేసీఆర్ టికెట్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్.. బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి బరిలో ఉన్నారు. అలాగే భారీ సంఖ్యలో స్వతంత్ర అభ్యర్థులు కూడా పోటీలో ఉన్నారు. కానీ వారి ముగ్గురి మధ్యే ప్రధాన పోటీ నెలకొననుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. నవంబర్ 11న పోలింగ్ జరగనుండగా.. 14న కౌంటింగ్ జరగనుంది.

అయితే ఈ ఉప ఎన్నికలో అధికార కాంగ్రెస్ పార్టీ తరఫున నవీన్ కుమార్ యాదవ్ ప్రచార పర్వంలో తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ సింగర్ కమ్ హీరో రాహుల్ సిప్లిగంజ్.. నవీన్ కుమార్ యాదవ్ కు మద్దతుగా నిలిచాడు. నవీన్ అన్న చాలా మంచోడని, గెలిపించాలని కోరాడు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోను రిలీజ్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో ఫుల్ వైరల్ గా మారింది.
ఆ వీడియోలో రాహుల్ మాట్లాడుతూ.. నవీన్ యాదవ్ అన్న చాలా మంచోడు. ఇంజినీరింగ్ చేసిన వ్యక్తులు రాజకీయాల్లోకి రావడం చాలా తక్కువ కానీ నవీన్ అన్న రాజకీయాల్లోకి వచ్చాడని అన్నారు. ఆయన్ను గెలిపిస్తే జూబ్లీహిల్స్‌ను ఇంకా బాగా అభివృద్ధి చేస్తారని.. ఉన్న క్యాండిడేట్స్‌లో నవీన్ అన్నే బెస్ట్ లీడర్ అని చెప్పుకొచ్చారు.
మరోవైపు ఇటీవల ఆర్ఆర్ పొలిటికల్ రీసెర్చ్ సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం.. ఈ ఉపఎన్నికల్లో నవీన్ యాదవ్ 36 వేల మెజారిటీతో గెలిచే అవకాశం ఉందని అంచనా వేసింది. ఆయన గతంలో రెండుసార్లు పోటీ చేసినప్పటికీ ఓటమి పాలయ్యారు. దాంతో ప్రజల్లో సానుభూతి, స్థానికంగా సామాజిక సేవా కార్యక్రమాలు, యువతలో ఫాలోయింగ్ ఆయనకు కలిసొచ్చే అంశాలుగా భావిస్తున్నారు. మొత్తంగా జూబ్లీహిల్స్ ఉపఎన్నిక తెలంగాణలో భవిష్యత్తు రాజకీయ సమీకరణాలకు దిశానిర్దేశం చేయనుంది.
ఇంజినీర్ చదివిన...
— Congress for Telangana (@Congress4TS) October 25, 2025
విద్యావంతుడు నవీన్ అన్న...
అలాంటి నాయకుడిని ఎన్నుకుంటే...
జూబ్లీహిల్స్ ను అభివృద్ధి చేస్తాడు...
----- రాహుల్ సిప్లిగంజ్ #NaveenYadav #JublieeHills #Congress pic.twitter.com/TM1ZF8BaN7












Click it and Unblock the Notifications