సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పెళ్లి ఫోటోలు వైరల్..
టాలీవుడ్ ప్రముఖ సింగర్, ఆస్కార్ అవార్డ్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఇవాళ తెల్లవారుజామున తన ప్రియురాలు హరిణ్యను పెళ్లి చేసుకున్నారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో ఈ వివాహం ఘనంగా జరిగింది. హైదరాబాద్ లో జరిగిన ఈ వేడుకకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పాట పాడితే అది ఓ ట్రెండ్ సెట్టర్. ఆయన గొంతు కదిపితే యువత స్టెప్పులేస్తుంది. ఓల్డ్ సిటీ నుంచి ఆస్కార్ వరకూ తన ప్రతిభను చాటారు రాహుల్ సిప్లిగంజ్. ఆయన పాడిన పాటల్లో కాలేజ్ బుల్లోడా, రంగా రంగా రంగ స్థలానా, బొమ్మోలే ఉన్నదిరా పోరీ సాంగ్స్, ఓ నా రాహులా సాంగ్స్ బ్లాక్ బస్టర్ హిట్ సాధించాయి. అలాగే రాహుల్ సిప్లిగంజ్.. బోనాలు, వినాయక చవితి స్పెషల్ సాంగ్స్ తో మెప్పించారు. ఇక కాలభైరవతో కలిసి ఆర్‌ఆర్‌ఆర్ మూవీలో రాహుల్ పాడిన నాటునాటు పాటకు ఆస్కార్ అవార్డు రావడం ఆయన టాలెంట్ కు నిదర్శనంగా చెప్పవచ్చు.

అయితే తాజాగా సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఓ ఇంటివాడయ్యాడు. గురువారం తెల్లవారు జామున తన ప్రియురాలు హరిణ్య మెడలో మూడు ముళ్లు వేశారు. ఈ వివాహవేడుక హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాజకీయ, సినిమా ప్రముఖులు హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ వివాహ వేడుకకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. ఈ క్రమంలోనే వీరి వివాహానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హాజరయ్యారు. నూతన వధూవరులకు ఆశీర్వాదం అందించారు.
Star Singer Rahul Sipligunj Ties the Knot
— Telangana Ahead (@telanganaahead) November 27, 2025
Rahul Sipliganj’s grand wedding lit up Hyderabad last night, with several film and political celebrities attending and blessing the couple.#RahulSipligunj #Hyderabad #CelebrityWedding #TollywoodNews #BreakingNews pic.twitter.com/arhfmatY3r
అనంతరం కవితతో అక్కడివాళ్లు సెల్ఫీలు తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. మరోవైపు రాహుల్ సిప్లిగంజ్ కు నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇక ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత టాలీవుడ్ లో బిజీగా మారారు రాహుల్ సిప్లిగంజ్.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు












Click it and Unblock the Notifications