ఫాంహౌస్‌పై దాడి, 11మంది ఈవ్ టీజర్స్ అరెస్ట్

హైదరాబాద్: పోలీసుల అనుమతి లేకుండా ఫాం హౌస్‌లో పుట్టిన రోజు వేడుకల పార్టీ నిర్వహిస్తుండటంతో పోలీసులు దాడులు చేసి నిర్వాహకులను అరెస్ట్ చేశారు. ఇది మొయినాబాద్ మండలంలో జరిగింది. ఓ ఫామ్‌హౌస్‌లో నగరానికి చెందిన వ్యక్తి బర్త్ డే నిర్వహించారు.

అతని స్నేహితులు 30 మంది బర్త్ డే పార్టీకి శనివారం హాజరయ్యారు. ఈ పార్టీలో మద్యానికి ఎక్సైజ్ పోలీసుల అనుమతి తీసుకున్నారు. కానీ హుక్కా, డీజేను ఏర్పాటు చేశారు. అనుమతి లేకుండా హుక్కా, డీజే సిస్టమ్ ఏర్పాటు చేసుకున్నారని, పోలీసులకు సమాచారంతో అందడంతో ఫామ్ హౌస్‌పై దాడులు చేశారు. వారి నుంచి నాలుగు హుక్కాలు, డీజేను స్వాధీనం చేసుకున్నారు.

11 మంది ఈవ్ టీజర్స్ అరెస్ట్

Raid at farmhouse, DJ seized

మహిళల భద్రతలో భాగంగా గత ఏడాది డిసెంబర్ నెలలో ప్రారంభించిన 24న సైబరాబాద్‌లో ప్రారంభమైన షీ టీమ్స్ 11మంది ఈవ్‌టీజర్లను అదుపులోకి తీసుకున్నాయి. కాలేజి అమ్మాయిలు, మహిళలను వేధిస్తున్న వీరిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని, శనివారం నిందితులకు వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించారు.

వారం రోజుల్లో మొత్తం తొమ్మిది కేసులు నమోదు కాగా పదకొండు మందిని అరెస్టు చేశామని మల్కాజిగిరి డీసీపీ రమారాజేశ్వరి తెలిపారు. ఎల్బీ నగర్, శంషాబాద్, మల్కాజిగిరి, మాదాపూర్, బాలానగర్ జోన్‌లలో మహిళలు వేధింపులు ఎదుర్కొంటున్న 58ప్రాంతాలను గుర్తించినట్లు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+