Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రాయగిరి రైల్వే స్టేషన్ పేరు మార్పు - ఇకపై అది యాదాద్రి రైల్వే స్టేషన్ - భారీ ప్రణాళికలు

తెలంగాణలోని రాయగిరి రైల్వే స్టేషన్ పేరును రైల్వే శాఖ మార్చేసింది. ఇకపై దానిని యాదాద్రి రైల్వే స్టేషన్ గా వ్యవహరించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు సౌత్ సెంట్రల్ రైల్వే సీపీఆర్వో రాకేశ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

సికింద్రాబాద్ - ఖాజీపేట రూట్ లో యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్న రాయగిరి రైల్వేస్టేషన్ పేరును యాదాద్రి రైల్వే స్టేషన్ గా మార్చే ప్రక్రియపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నుంచి వచ్చిన సూచనల మేరకు నిర్ణయం తీసుకున్నామని రైల్వే అధికారులు తెలిపారు. స్టేషన్ కోడ్ ను YADD గా నిర్ణయించినట్లు చెప్పారు.

Raigir railway station renamed as Yadadri railway station: SCR

తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రిని ప్రపంచ స్థాయి క్షేత్రంగా మలచాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించడం, ఆ మేరకు భారీ ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టడం, ఆలయ రూపురేఖలను వైభవంగా మార్చేయడం, చుట్టు పక్కల ప్రాంతాలను కూడా అభివృద్ధి చేస్తుండటం తెలిసిందే. రాబోయే రోజుల్లో యాదాద్రి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉండటంతో రైల్వే స్టేషన్ కు కూడా పుణ్యక్షేత్రం పేరునే పెట్టాలని కేసీఆర్ సర్కారు కేంద్రాన్ని కోరింది. ఈ మేరకు ఢిల్లీ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో సికింద్రాబాద్ లోని ఎస్‌సీఆర్ అధికారులు ప్రకటన చేశారు.

రాయగిరి నుంచి యాదాద్రిగా పేరుమారిన రైల్వే స్టేషన్ ను కూడా కేంద్రం సాయంతో పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలని కేసీఆర్ సర్కారు భావిస్తున్నది. మరోవైపు, హైదరాబాద్ మెట్రో రైలు సేవలను యాదాద్రి వరకు పొడగించే ప్రతిపాదనను కూడా ప్రభుత్వం పరిశీలిస్తున్నది. మొత్తంగా యాదాద్రి అభివృద్ధిలో రైల్వే స్టేషన్ పేరు మార్పు కీలక పరిణామంగా నిలిచింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+