చర్లపల్లి - తిరుపతికి ప్రత్యేక రైళ్లు, అరుణాచలంకు ప్రత్యేకంగా: రూట్, షెడ్యూల్..!!

బ్రహ్మోత్సవాల వేళ తిరుపతికి వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్. దసరా సెలవులు.. బ్రహ్మోత్సవాల రద్దీ పెరుగుతోంది. ఈ సమయంలోనే రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. చర్లపల్లి నుంచి తిరుపతికి ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. అదే విధంగా దసరా, దీపావళి రద్దీ వేళ కొత్తగా పలు మార్గాల్లో రైళ్లను నడుపుతోంది. తెలుగు రాష్ట్రాల నుంచి అరుణాచలం కు వెళ్లే భక్తుల కోసం ప్రత్యేకంగా నిర్ణయాలు తీసుకుంది. సెలవులు పూర్తయ్యే వరకూ ప్రయాణీకుల రద్దీకి అనుగుణం గా నిర్ణయాలు ఉంటాయని అధికారులు వెల్లడించారు.

దసరా సెలవులు ప్రారంభం కావటంతో ప్రయాణ ప్రాంగణాలు రద్దీగా మారాయి. ఈ క్రమంలో రైల్వే, ఆర్టీసీ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. చర్లపల్లి-తిరుపతి మధ్య ఆది, సోమవారాల్లో రెండు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణమధ్యరైల్వే ప్రకటించింది. 07713 ప్రత్యేకరైలు చర్లపల్లి నుంచి ఆదివారం సాయంత్రం 6.10గంటలకు, 07714 ప్రత్యేక రైలు తిరుపతి నుంచి సోమవారం మధ్యాహ్నం 2.45గంటలకు బయల్దేరుతాయని తెలిపారు. ఈ రైలు జనగాం, ఖాజీపేట్‌, వరంగల్‌, మహబూబాబాద్‌, డోర్నకల్‌, ఖమ్మం, మధిర, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట స్టేషన్లలో హాల్ట్‌ ఉంటుందని అధికారులు వెల్లడించారు. ఈ రైలుకు రిజర్వేషన్ సౌకర్యం కల్పించారు. కాగా.. రద్దీ వేళ ప్రత్యేక రైళ్లను ప్రకటించిన రైల్వే అధికారులు.. వాటిల్లో ఖాళీ వివరాలను ప్రకటించారు.

 స్థానిక ఎన్నికల షెడ్యూల్: ఎప్పుడు ఏ ఎలక్షన్ - రిజర్వేషన్లు ఇలా..నేడే..!!
స్థానిక ఎన్నికల షెడ్యూల్: ఎప్పుడు ఏ ఎలక్షన్ - రిజర్వేషన్లు ఇలా..నేడే..!!
railways-announces-special-trains-between-cherlapalli-tirupati-during-dasara-rush-here-the-schedul

రద్దీ వేళ ప్రత్యేక రైళ్లు

హెచ్‌.ఎస్‌. నాందేడ్-తిరుచానూరు ప్రత్యేక రైలు (07603)లో అక్టోబర్ 13న 544 బెర్తులు, అక్టోబర్ 20న 813, అక్టోబర్ 27న 843 బెర్తులు ఉన్నాయి. నవంబర్ 3న 911, నవంబర్ 10న 526, నవంబర్ 17న 871, నవంబర్ 24న 902 బెర్తులు అందుబాటులో ఉన్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. అదే విధంగా చర్లపల్లి-నరసాపురం ప్రత్యేక రైలు (07063)లో అక్టోబర్ 19న 236 బెర్తులు, అక్టోబర్ 26న 450, నవంబర్ 2న 466, నవంబర్ 9న 470, నవంబర్ 16న 470, నవంబర్ 23న 470, నవంబర్ 30న 470 బెర్తులు అందుబాటులో ఉన్నాయి. రైలు నంబర్ 06590 బీదర్-బెంగళూరు కంటోన్మెంట్ ప్రత్యేక రైలులో అక్టోబర్ 10న 510, అక్టోబర్ 17న 608 బెర్తులు అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+