Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సంక్రాంతికి మరిన్ని ప్రత్యేక రైళ్లు - రూట్, షెడ్యూల్..!!

సంక్రాంతి ప్రయాణీకులకు రైల్వే శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. సంక్రాంతి వేళ ఇప్పటికే పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. కాగా, పెరుగుతున్న డిమాండ్ మేరకు రద్దీ మార్గాల్లో మరిన్ని రైళ్లను ఖరారు చేసింది. ఈ ప్రత్యేక రైళ్లు జనవరి 9, 10, 18వ తేదీలలో ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. ఈ మేరకు రైల్వే శాఖ రైళ్ల వివరాలు.. టైమింగ్స్ ను వెల్లడించింది. ఈ ప్రత్యేక రైళ్లకు రిజర్వేషన్ అందుబాటులోకి వచ్చింది.

సంక్రాంతి రద్దీ వేళ దక్షిణ మధ్య రైల్వే పలు ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఇప్పటికే పెద్ద సంఖ్య లో రైళ్లను ప్రకటించినా.. ఇంకా పలు మార్గాల్లో భారీగా వెయిటింగ్ లిస్టు కొనసాగుతోంది. దీంతో, ప్రయాణీకుల సౌకర్యార్ధం మరిన్ని రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. హైదరాబాద్‌- విజయ వాడతో పాటు ఇతర మార్గాల్లో ప్రత్యేక రైళ్లను నడిపేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ ప్రత్యేక రైళ్లు జనవరి 9, 10, 18వ తేదీలలో ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని రైల్వే అధికారులు వెల్లడించారు.

Railways announces special trains for Sankranti in Telugu states Schedule here

హైదరాబాద్ నుంచి విజయవాడ, హైదరాబాద్ నుంచి సిర్పూర్ కాగజ్ నగర్ రూట్‌లలో మొత్తం 8 ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. హైదరాబాద్- విజయవాడ మధ్య రాకపోకలు సాగించే 07471 నెంబర్ గల ప్రత్యేక రైలు జనవరి 9, 10 తేదీల్లో ఉదయం 6 :10 నిమిషాలకు హైదరాబాద్‌ డెక్కన్ రైల్వే స్టేషన్ నుంచి బయల్దేరి మధ్యాహ్నం 1:40 నిమిషాలకు విజయవాడ రైల్వేస్టేషన్ చేరుకుంటుంది.

అదే విధంగా విజయవాడ- హైదరాబాద్‌ (07472) నెంబర్ గల ప్రత్యేక రైలు జనవరి 9, 18 తేదీల్లో మధ్యాహ్నం 2.40 నిమిషాలకు విజయవాడ నుంచి బయల్దేరి రాత్రి 10: 35 నిమిషాలకు హైదరాబాద్‌ డెక్కన్ రైల్వే స్టేషన్ చేరుకుంటుంది.హైదరాబాద్-విజయవాడ మధ్య నడిచే ఈ రెండు ప్రత్యేక రైళ్లు సికింద్రాబాద్, చర్లపల్లి, జనగాం, ఘన్‌పూర్, ఖాజీపేట, వరంగల్, నెక్కొండ, కేసముద్రం, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, మధిర స్టేషన్ల మీదుగా రాకపోకాలు సాగిస్తాయి.

ఇక.. హైదరాబాద్-సిర్పూర్ కాగజ్ నగర్ (07469) ప్రత్యేక రైలు జనవరి 9, 10వ తేదీలలో ఉదయం 7:55 నిమిషాలకు హైదరాబాద్ నుంచి బయల్దేరి మధ్యాహ్నం 2:15కు సిర్పూర్ కాగజ్ నగర్ చేరుకుంటుంది. అలాగే సిర్పూర్ కాగజ్ నగర్ - హైదరాబాద్ మధ్య రాకపోకలు సాగించే 07470 నెంబర్ గల ప్రత్యేక రైలు జనవరి 9, 18 వ తేదీలలో మధ్యాహ్నం 3:15 నిమిషాలకు సిర్పూర్ కాగజ్ నగర్ నుంచి బయల్దేరి రాత్రి 10:20 నిమిషాలకు హైదరాబాద్ చేరుకుంటుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+