హైటెక్ సిటీలో కొత్తగా 10 ప్రధాన రైళ్లకు హాల్టింగ్- ట్రైన్స్, టైమింగ్స్ వివరాలు..!!

రైల్వే ప్రయాణీకులకు బిగ్ అప్డేట్. దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన చేసింది. హైటెక్‌ సిటీ రైల్వే స్టేషన్‌లో పది ప్రధాన రైళ్లకు తాత్కాలిక స్టాపేజ్‌ కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. మాదాపూర్, గచ్చిబౌలి, హైటెక్‌ సిటీ పరిసర ప్రాంతాల ప్రజలు ప్రధాన స్టేషన్లకు వెళ్లే వారికి ప్రయోజనకరంగా ఉండేలా నిర్ణయం వెల్లడించారు. ఈ మార్గంలో ప్రయాణించే రైళ్లు.. అమలు ముహూర్తం.. టైమింగ్స్ వివరాలను అధికారులు ప్రకటించారు.

దక్షిణ మధ్య రైల్వే హైటెక్ రైల్వే స్టేషన్ లో పది ప్రధాన రైళ్లకు స్టాపేజ్ సౌకర్యం అందుబాటులోకి తీసుకొచ్చింది. నవంబరు 1, 2026 నుంచి జనవరి 31, 2027 వరకు హైటెక్‌ సిటీ రైల్వే స్టేషన్‌లో పది ప్రధాన రైళ్లకు తాత్కాలిక స్టాపేజ్‌ కల్పించారు. రాజ్‌కోట్, పోరుబందర్, తిరుపతి, బెంగళూరు, పుణె మార్గాలలో ప్రయాణించే వారికి వెసులుబాటు కలగనుంది. మాదాపూర్, గచ్చిబౌలి, హైటెక్‌ సిటీ పరిసర ప్రాంతాల ప్రజలు ప్రధాన స్టేషన్లకు వెళ్లే ఇబ్బందులు తొలికేలా నిర్ణయం తీసుకున్నారు. సికింద్రాబాద్, హైదరాబాద్ స్టేషన్లలో రద్దీ తగ్గించడమే ఈ నిర్ణయ ప్రధాన ఉద్దేశంగా ఉంది. ఇప్పటికే రిజర్వేషన్ చేసుకున్న వారు ఎలాంటి అదనపు రుసుము లేకుండా బోర్డింగ్ పాయింట్ మార్చుకోవచ్చు. ఆన్‌లైన్‌లో లేదా రైల్వే కౌంటర్ల ద్వారా ఈ వెసులుబాటు అందుబాటులో ఉంటుంది. పండగ సమయాల్లో ఇళ్లకి వెళ్లే వారికి ఇది ప్రయోజన కరంగా ఉండనుంది.

ఇంటర్ చదివే ఈ విద్యార్ధులకు స్కూటీలు - ప్రభుత్వం మార్గదర్శకాలు..!!
ఇంటర్ చదివే ఈ విద్యార్ధులకు స్కూటీలు - ప్రభుత్వం మార్గదర్శకాలు..!!
railways-announces-stoppage-facility-for-main-express-trains-in-hitech-city-station-here-the-sched

రైల్వే అధికారుల తాజా నిర్ణయంతో

కాగా.. పది రైళ్లకు హైటెక్‌ సిటీ స్టేషన్‌లో హాల్ట్ ఇచ్చారు. సికింద్రాబాద్ - రాజ్‌కోట్ రైలు మధ్యాహ్నం 3.30 గంటలకు, రాజ్‌కోట్ - సికింద్రాబాద్ రైలు ఉదయం 6.19 గంటలకు చేరుకుంటాయి. సికింద్రాబాద్ - పోరుబందర్ రైలు మధ్యాహ్నం 3.30 గంటలకు, పోరుబందర్ - సికింద్రాబాద్ రైలు ఉదయం 6.19 గంటలకు ఆగుతాయి. తిరుపతి - సికింద్రాబాద్ రైలు ఉదయం 6.08 గంటలకు, సికింద్రాబాద్ - తిరుపతి రైలు తెల్లవారుజామున 4.35 గంటలకు ఇక్కడకు వస్తాయి. హైదరాబాద్ - ఎస్ఎంవీటీ బెంగళూరు రైలు రాత్రి 1.17 గంటలకు, బెంగళూరు - హైదరాబాద్ రైలు ఉదయం 11.07 గంటలకు నిలుస్తాయి. పుణె - హైదరాబాద్ రైలు మధ్యాహ్నం 1.33 గంటలకు, హైదరాబాద్ - పుణె రైలు మధ్యాహ్నం 3 గంటలకు ఆగుతాయి. ప్రయాణికులు తమ ప్రయాణ సమయాలను ముందుగానే సరిచూసుకోవడం చాలా ముఖ్యం. జనవరి 31, 2027 వరకు మాత్రమే ఈ తాత్కాలిక సదుపాయం అందుబాటులో ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+