సికింద్రాబాద్, ఏపీ మీదుగా బెంగళూరుకు వెళ్లే ఈ వీక్లీ ఎక్స్ ప్రెస్ ఇకపై - హాల్ట్ స్టేషన్లు!!

దేశంలో పండగ సీజన్ ఆరంభమైంది. దీంతో పాటే రైళ్లు ప్రయాణికుల తాకిడీ క్రమంగా పెరుగుతూ వస్తోంది. వివిధ నగరాల మధ్య నెలకొంటోన్న ప్రయాణికుల రద్దీని తగ్గించడానికి రైల్వే అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటోన్నారు. తరచూ వేర్వేరు మార్గాల్లో ప్రత్యేక రైళ్లను తరచూ ప్రకటిస్తోన్నారు. గతంలో ప్రకటించిన ప్రత్యేక రైళ్లను పొడిగించడం, వాటిని రెగ్యులరైజ్ చేయడం వంటి చర్యలు ఇందులో భాగంగా మారుతున్నాయి.

ఏపీ, తెలంగాణల నుంచి రాకపోకలు సాగించే రైళ్లు ఇవి. నర్సాపూర్, హైదరాబాద్, చర్లపల్లి, తిరుపతి వంటి స్టేషన్ల నుంచి ఈ ప్రత్యేక రైళ్లు వివిధ ప్రధాన గమ్యస్థానాల మధ్య అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో మెజారిటీ రైలు సర్వీసులను పొడిగించారు. ప్రయాణికుల నుండి అపూర్వ ఆదరణ అందుతున్న నేపథ్యంలో వాటిని రెగ్యులరైజ్ చేస్తోన్నారు కూడా. తెలంగాణ మీదుగా రాకపోకలు సాగించే మరో వీక్లీ స్పెషల్ ఎక్స్ ప్రెస్ ను కూడా తాజాగా క్రమబద్దీకరించారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలపై రైల్వే బోర్డు ఆమోదం తెలిపింది.

Railways approved the Proposal of Regularization Bilaspur- Yelahanka Weekly Express via secunderabad

బిలాస్ పూర్ నుంచి యలహంక (బెంగళూరు) మధ్య రాకపోకలు సాగించే వీక్లీ ఎక్స్ ప్రెస్ ఇది. ప్రతి బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు బిలాస్ పూర్ నుంచి బయలుదేరే 18261 వీక్లీ ఎక్స్ ప్రెస్ మరుసటి రోజు సాయంత్రం 7 గంటలకు యలహంకకు చేరుకుంటుంది.

సికింద్రాబాద్ నుంచి అరుణాచలం, మధురై స్పెషల్ ఎక్స్‌ప్రెస్‌- ఏపీలో హాల్ట్ స్టేషన్లు
సికింద్రాబాద్ నుంచి అరుణాచలం, మధురై స్పెషల్ ఎక్స్‌ప్రెస్‌- ఏపీలో హాల్ట్ స్టేషన్లు

ప్రతి గురువారం రాత్రి 9:30 గంటలకు యలహంక నుంచి బయలుదేరే నంబర్ 18262 వీక్లీ ఎక్స్ ప్రెస్ శనివారం వేకువ జామున 3:30 గంటలకు బిలాస్ పూర్ కు చేరుకుంటుంది.

ఏపీ నుంచి చెన్నై వైపు ప్రత్యేక రైళ్లు: హాల్ట్ స్టేషన్లు- బుకింగ్ ఓపెన్
ఏపీ నుంచి చెన్నై వైపు ప్రత్యేక రైళ్లు: హాల్ట్ స్టేషన్లు- బుకింగ్ ఓపెన్

భటాపారా, రాయ్ పూర్, దుర్గ్, రాజ్ నందగావ్, డోంగర్ గఢ్, గోండియా, వాడ్సా, చందా ఫోర్ట్, బల్లార్షా, సిర్పూర్ కాగజ్ నగర్, మంచిర్యాల, ఖాజీపేట్, చర్లపల్లి, సికింద్రాబాద్, లింగంపల్లి, వికారాబాద్, తాండూరు, యాద్గిర్, కృష్ణా, రాయచూర్, మంత్రాలయం రోడ్, గుంతకల్, గుత్తి, ధర్మవరం మీదుగా ఈ ఎక్స్ ప్రెస్ రాకపోకలు సాగిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+