హైదరాబాద్ చుట్టూ 3 భారీ రైల్వే టెర్మినళ్లు- ఈ ప్రాంతాల్లోనే.. గేమ్ ఛేంజర్..!!
హైదరాబాదీలకు రైల్వే శాఖ సూపర్ వార్త చెప్పింది. హైదరాబాద్ చుట్టూ కొత్తగా మూడు భారీ రైల్వే టెర్మినళ్లను నిర్మించేందుకు రైల్వే శాఖ ప్రణాళికలు రూపొందించింది. వీటిని ఎక్కడ నిర్మించాల నే ప్రతిపాదనలను సీఎం రేవంత్ తో పంచుకుంది. ప్రస్తుతం సికింద్రాబాద్ స్టేషన్ లో ఆధునీకరణ పనులు జరుగుతున్నాయి. ఇక్కడకు హైదరాబాద్ శివారు ప్రాంతాల నుంచి స్టేషన్లకు చేరుకు నేందుకు గంట, గంటన్నర సమయం పడుతోంది. దీంతో.. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఈ మూడు భారీ టెర్మినల్స్ నిర్మాణానికి రైల్వే శాఖ ముందుకొచ్చింది. ఇది గేమ్ ఛేంజర్ కానుంది.
ప్రధాన నగరాల్లో దూర ప్రాంతాల నుంచి వచ్చే రైళ్లను, ఆయా నగరాల మీదుగా ఇతర ప్రాంతాల కు వెళ్లే ఎక్స్‌ప్రెస్‌లను వాటి శివారు ప్రాంతాలకు పరిమితం చేస్తున్నారు. అదే రీతిలో హైదరా బాద్ చుట్టూ 3 రైల్వే టెర్మినళ్లను ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ (ట్రిపులార్) మధ్యలో నిర్మించేందుకు దక్షిణ మధ్య రైల్వే ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇప్పటికే చర్లపల్లి టెర్మినల్‌ను నిర్మించి అందు బాటులోకి తీసుకువచ్చింది. వికారాబాద్-ముంబయి మార్గంలో రామచంద్రాపురం మండలంలోని నాగులపల్లి టెర్మినల్ కట్టాలనే డిమాండ్ ఇప్పటికే ఉంది. దీంతోపాటు మహబూబ్‌నగర్-బెంగళూరు మార్గంలో జూకల్-శంషాబాద్, నిజామాబాద్-నాందేడ్ మార్గంలో డబిల్‌పుర్-మేడ్చల్ టెర్మినళ్లపై రైల్వే శాఖ దృష్టి పెట్టింది. ప్రతిపాదిత స్టేషన్ల వివరాల్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో జరిగిన సమావేశంలో దక్షిణ మధ్య రైల్వే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది.

ప్రస్తుతం హైదరాబాద్ పరిధిలో సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ ప్రధాన స్టేషన్లపై ఒత్తిడి అధికంగా ఉంది. హైదరాబాద్ శివారు ప్రాంతాల నుంచి స్టేషన్లకు చేరుకునేందుకు గంట, గంటన్నర సమయం పడుతోంది. ఉదయం ఆయా స్టేషన్లలో ప్లాట్‌ఫారాల సమస్య అధికంగా ఉంది. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ మూడు టెర్మినళ్లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. అవి అందుబాటులోకి వస్తే ప్రయాణికులకు ఇబ్బందులతో పాటు ప్రధాన స్టేషన్లపై ఒత్తిడి తగ్గనుంది. జీహెచ్ఎంసీ పరిధిలో 2025లో 1.13 కోట్లుగా ఉన్న జనాభా, 2031లో 1.84 కోట్లకు, 2047లో 3.30 కోట్లకు పెరుగుతుందని రైల్వే శాఖ అంచనా వేసింది.ఈ అంచనాలకు అనుగుణంగా ఈ భారీ టెర్మినల్స్ కు ప్లాన్ చేస్తున్నారు. వీటి ద్వారా ఆ ప్రాంతాల్లో భూముల ధరలు పెరగటం.. ఎకనామిక్ యాక్టివిటీ పెరిగే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications