వెంటనే స్థలం ఖాళీ చేయండి: వందేళ్ల లల్లాగూడ చర్చికి రైల్వే ఎవిక్షన్ నోటీసులు
Lallaguda Sacred Heart Church: హైదరాబాద్ లల్లాగూడలోని శాక్రిడ్ హార్ట్ క్యాథలిక్ చర్చికి రైల్వే అధికారులు షాక్ ఇచ్చారు. వెంటనే ఈ స్థలాన్ని ఖాళీ చేయాలంటూ ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు ఎవిక్షన్ నోటీసులను జారీ చేశారు. ఈ నోటీసుల పట్ల క్రైస్తవ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తోన్నాయి.
లల్లాగూడలో సుమారు వందేళ్ల కిందట ఈ క్యాథలిక్ చర్చి నిర్మితమైంది. 1927లో నిర్మాణాన్ని పూర్తి చేసుకుంది. అప్పట్లోనే దీన్ని నిర్మించడానికి 7,000 రూపాయలు వ్యయం చేసినట్లు చెబుతున్నారు. దీని నిర్మాణానికి అప్పటి నిజాం నవాబుల ప్రభుత్వం 1,000 రూపాయలను విరాళంగా ఇచ్చింది.

ఈ చర్చి స్థలం తమకు చెందినదని, ఎలాంటి అనుమతులు లేకుండా దీన్ని నిర్మించారని రైల్వే మంత్రిత్వ శాఖ చెబుతోంది. ఈ స్థలాన్ని ఖాళీ చేయాలంటూ దక్షిణ మధ్య రైల్వే అధికారులు నోటీసులు ఇచ్చినట్లు ది టైమ్స్ ఆఫ్ ఇండియా ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. స్థలాన్ని ఖాళీ చేయడానికి నెల రోజుల గడువు ఇచ్చారు రైల్వే అధికారులు.
అలా చేయకపోతే పబ్లిక్ ప్రెమిసెస్ (ఆక్రమణదారుల తొలగింపు) చట్టం- 1971 ప్రకారం తొలగింపు ప్రక్రియను చేపడతామని, అలాగే నిర్వాహకులపై చట్టపరమైన చర్యలను తీసుకునే అవకాశం ఉందని హెచ్చరించారు. లల్లాగూడ ఎస్‌ఎల్‌డీజీ ఆఫీసర్స్ అండ్ స్టాఫ్ కాలనీలో ఉన్న తమ భూమిలో ఈ చర్చిని చట్టవిరుద్ధంగా నిర్మించారని దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఈ నోటీసుల్లో స్పష్టం చేశారు.

నిజాం గ్యారెంటీడ్ స్టేట్ రైల్వే కంపెనీకి చెందిన లోకో హెడ్ క్వార్టర్స్‌గా ఉంటూ వస్తోంది లల్లాగూడ. 1927 ఫిబ్రవరిలో అప్పటి రైల్వే అధికారులు చర్చి నిర్మాణానికి కొంత స్థలాన్ని కేటాయించారని, ఈ మేరకు ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నాయని టైమ్స్ ఆఫ్ ఇండియా తన కథనంలో పేర్కొంది.
చర్చి నిర్మాణానికి 1927 మార్చిలో అనుమతులు జారీ అయ్యాయని, అదే సంవత్సరం జూలైలో నిర్మాణాన్ని ప్రారంభించారు. ఆ తరువాత అందులో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటూ వచ్చాయి. ఫాదర్ మదను ఆరోగ్యం, ఆర్చ్ బిషప్ సామినేని అరులప్ప ఫాదర్ చొప్పరపు ఆరోగ్యం, ఆర్చ్ బిషప్ మారంపూడి జోజి క్రమంగా దీన్ని విస్తరించారు.
-
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
ఐఆర్సీటీసీలో 3 కోట్ల ఫేక్ ఖాతాల తొలగింపు.. కేంద్ర రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్..












Click it and Unblock the Notifications