హైదరాబాద్, ఏపీ నుంచి కొల్లం ప్రత్యేక రైళ్లు- హాల్ట్ స్టేషన్లు
Special Trains to Kollam: అయ్యప్పస్వామి భక్తుల కోసం రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కేరళలోని వివిధ స్టేషన్లకు ప్రత్యేక రైళ్లను నడిపిస్తోన్నారు దక్షిణ మధ్య రైల్వే అధికారులు. ఈ క్రమంలో తాజాగా హైదరాబాద్, చర్లపల్లి, శ్రీకాకుళం నుంచి ప్రత్యేక రైళ్లను నడిపించనున్నారు. దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. శబరిమల యాత్రీకుల తాకిడి నేపథ్యంలో డిసెంబర్ చివరి వారం వరకూ అవి అందుబాటులో ఉండనున్నాయి.
చర్లపల్లి- కొల్లం..
- ఈ నెల 20 నుంచి డిసెంబర్ 25వ తేదీ వరకు ప్రతి శుక్రవారం రాత్రి 11: 45 నిమిషాలకు చర్లపల్లి నుంచి బయలుదేరే నంబర్ 07180 ప్రత్యేక రైలు రెండో రోజు ఉదయం 7: 55 నిమిషాలకు కొల్లం చేరుకుంటుంది.

- తిరుగు ప్రయాణంలో ఈ నెల 22 నుంచి డిసెంబర్ 27వ తేదీ వరకు ప్రతి ఆదివారం ఉదయం 10: 40 నిమిషాలకు కొల్లం నుంచి బయలుదేరే నంబర్ 07181 ప్రత్యేక రైలు మరుసటి రోజు సాయంత్రం 7 గంటలకు చర్లపల్లికి చేరుకుంటుంది.
- నల్లగొండ, మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ల, గుంటూరు, తెనాలి, బెల్లంపల్లి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, పెరంబూరు, అరక్కోణం, కాట్పాడి, జోలార్ పేట, సేలం, ఈరోడ్, తిరుప్పూర్, పొదనూరు, పాలక్కాడ్, త్రిశూర్, ఆలువ, ఎర్నాకుళం టౌన్, కొట్టాయం, చంగనస్సేరి, తిరువళ్ల, చెంగన్నూర్, మావెళిక్కార, కాయంకుళం, కరుణాగపల్లి, సస్థామ్ కోట మీదుగా ఈ ఎక్స్ ప్రెస్ రాకపోకలు సాగిస్తుంది.
హైదరాబాద్- కొల్లం..
- డిసెంబర్ 5 నుంచి అదేనెల 26వ తేదీ వరకు ప్రతి శనివారం రాత్రి 11: 10 నిమిషాలకు హైదరాబాద్ నుంచి బయలుదేరే నంబర్ 07193 ప్రత్యేక ఎక్స్ ప్రెస్ సోమవారం ఉదయం 7: 15 నిమిషాలకు కొల్లం చేరుకుంటుంది.
- తిరుగు ప్రయాణంలో డిసెంబర్ 7 నుంచి 28వ తేదీ వరకు ప్రతి సోమవారం ఉదయం 10: 55 నిమిషాలకు కొల్లం నుంచి బయలుదేరే నంబర్ 07194 ప్రత్యేక ఎక్స్ ప్రెస్ మరుసటి రోజు సాయంత్రం 6: 30 నిమిషాలకు హైదరాబాద్ కు చేరుకుంటుంది.
- సికింద్రాబాద్, చర్లపల్లి, నల్లగొండ, మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ల, గుంటూరు, తెనాలి, బెల్లంపల్లి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, పెరంబూరు, అరక్కోణం, కాట్పాడి, జోలార్ పేట, సేలం, ఈరోడ్, తిరుప్పూర్, పొదనూరు, పాలక్కాడ్, త్రిశూర్, ఆలువ, ఎర్నాకుళం టౌన్, కొట్టాయం, చంగనస్సేరి, తిరువళ్ల, చెంగన్నూర్, మావెళిక్కార, కాయంకుళం మీదుగా ఈ ఎక్స్ ప్రెస్ రాకపోకలు సాగిస్తుంది.
మచిలీపట్నం- కొల్లం
- ఈ నెల 22 నుంచి జనవరి 24వ తేదీ వరకు ప్రతి ఆదివారం ఉదయం 9:20 నిమిషాలకు మంచిలీపట్నం నుంచి బయలుదేరే నంబర్ 08539 ప్రత్యేక ఎక్స్ ప్రెస్ మరుసటి రోజు రాత్రి 9: 30 గంటలకు కొల్లం చేరుకుంటుంది.
- ఈ నెల 24 నుంచి జనవరి 26వ తేదీ వరకు ప్రతి మంగళవారం మధ్యాహ్నం 2:30 గంటలకు కొల్లం నుంచి బయలుదేరే నంబర్ 08540 ప్రత్యేక ఎక్స్ ప్రెస్ మరుసటి రోజు రాత్రి 9:30 గంటలకు కొల్లం చేరుకుంటుంది.
- విజయనగరం, విశాఖపట్నం, దువ్వాడ, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, జోలార్ పేట, సేలం, ఈరోడ్, తిరుప్పూర్, పొదనూర్, పాలక్కాడ్, త్రిశూర్, ఆలువ, ఎర్నాకుళం టౌన్, కొట్టాయం, తిరువళ్ల, చంగనస్సేరి, కాయంకుళం మీదుగా ఈ రైలు కొల్లం చేరుకుంటుంది.












Click it and Unblock the Notifications
