వర్షం ఎఫెక్ట్: తెలంగాణలో సెలవులు రద్దు, రోడ్ల పరిస్థితిపై ధర్నా
హైదరాబాద్: రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో నీటి పారుదల శాఖ అధికారులకు సెలవులు రద్దు చేశారు. ఈ విషయాన్ని మంత్రి హరీష్ రావు తెలిపారు. వర్షాలపై నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు బుధవారం నాడు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భారీ వర్షాల వల్ల నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లో చెరువులు తెగే ప్రమాదం ఉందన్నారు. చెరువులు, తూములు తెగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు.
ముంపు ప్రాంతాలను గుర్తించి ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. చెరువుల పొంగుతున్న చోట యుద్ధప్రతిపాదికన రక్షణ చర్యలు చేపట్టాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా క్షమించేది లేదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ నుంచి సమీక్షిస్తున్నారన్నారు. కాగా, వర్షాల వల్ల పలుచోట్ల స్కూళ్లు, ఆఫీసులు బంద్ అయ్యాయి.

టిఎన్ఎస్ఎఫ్ ధర్నా
భాగ్యనగరంలో రోడ్లు ధ్వంసమైనా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆరోపించింది. రహదారులకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేస్తూ టీఎన్‌ఎస్‌ఎఫ్ ప్రతినిధి మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో పంజాగుట్టలోని మోడల్ హౌస్ వద్ద కార్యకర్తలు ధర్నా చేపట్టారు.
నగరవ్యాప్తంగా తెరిచి ఉన్న మ్యాన్‌హోళ్ల చిత్రాలతో కూడిన ప్లకార్డులను ప్రదర్శిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సమాచారం అందుకున్న పంజాగుట్ట పోలీసులు అక్కడికి చేరుకుని వారిని అరెస్టు చేసి, గోషామహల్ పోలీస్ స్టేషన్ తరలించారు.
-
హైదరాబాద్ లో 100 కు పైగా ఎకరాల్లో.. -
ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం.. ఆంధ్రప్రదేశ్ స్టార్ హోటల్ పరిశ్రమపై భారం! -
పాకిస్థాన్ లో బర్రెలకు డైపర్లు.. లేదంటే రోజుకు రూ.30 పన్ను కట్టాల్సిందే.. -
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
ప్రేమ పేరుతో గొడ్డు మాంసం తినిపిస్తూ.. మతం మార్చి నరకయాతన! -
నా కోరిక తీరడం లేదు - ప్రధాని మనసులో మాట బయటపెట్టేశారు! -
జనసేన ఎమ్మెల్యేకు ఈసీ షాక్.. బయటపడ్డ 'మిరాకిల్' అక్రమాలు! -
తల్లికి వందనం పథకంపైన సీఎం చంద్రబాబు శుభవార్త! -
విజయసాయిరెడ్డి ఇంట్లోనే ఉంటున్న రఘురామకృష్ణంరాజు ?












Click it and Unblock the Notifications