ప్రజల పాపాల వల్లే ఈ పరిస్థితి: అండగా ఉంటానంటూ రంగం భవిష్యవాణి

హైదరాబాద్: నగరంలో బోనాలు ఘనంగా జరిగాయి. పాతబస్తీలోని లాల్ దర్వాజ సింహవాహిని మహంకాళీ అమ్మవారి బోనాల్లో రంగం ప్రత్యేకతను సంతరించుకుంది. మాతంగి అనురాధ పచ్చికుండపై నిలబడి భవిష్యవాణి వినిపించారు. ప్రజలు చేసుకుంటున్న పాపాల వల్లే వర్షాలు సకాలంలో పడటం లేదని అన్నారు. ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆమె ఆశీర్వదించారు.

భక్తుల పూజలపై సింహవాహిని మహంకాళి అమ్మవారు సంతృప్తి వ్యక్తం చేశారు. భక్తుల పూజలను ఆనందంతో అందుకున్నట్లు తెలిపారు. భక్తులకు ఎవరికీ ఏమి కాకుండా చూసుకుంటానని అభయం ఇచ్చారు. అయితే, వర్షాల ఆలస్యానికి భక్తులు చేసే పాపాలే కారణమని చెప్పారు. ప్రజలు చేసే పాపాల వల్లే ప్రకృతి వైపరీత్యాలు జరుగుతున్నాయన్నారు. ఆలయాన్ని అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. ఏం జరగకుండా తాను చూసుకుంటానని అన్నారు.

 Rain affected with sins of people: Lal Darwaza Simhavahini Bhavishyavani

అనంతరం అంబారిపై శ్రీ అక్కన మాదన్న మహంకాళి అమ్మవారి ఘటం ఊరేగింపు ప్రారంభమైంది. హైదరాబాద్ నగర సీపీ సీవీ ఆనంద్ జెండా ఊపి అమ్మవారి ఊరేగింపును ప్రారంభించారు. పాతబస్తీలోని వివిధ ప్రాంతాల నుంచి అమ్మవారి ఘటాలు ఉరేగింపులో డప్పులు, వాయిద్యాలు, ప్రత్యేకంగా తయారుచేసిన భారీ విగ్రహాలతో కళాకారుల బృందాలతో అమ్మవారి ఘటం ఊరేగింపు కొనసాగింది.

అమ్మవారి ఘటం ఊరేగింపు హరి బౌలి, లాల్ దర్వాజ క్రాస్‌ రోడ్‌, షాలిబండ, చార్మినార్ మీదుగా గుల్జార్ హౌజ్, నాయపుల్ దిల్లీ దర్వాజ వరకు సాగింది. పోతరాజుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను చాటి చెప్పే గొప్ప పండుగ బోనాల ఉత్సవాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.

ఉత్సవాల్లో భాగంగా ఉమ్మడి దేవాలయాల ఆధ్వర్యంలో చేపట్టిన అంబారిపై అమ్మవారి ఊరేగింపునకు చార్మినార్‌ వద్ద మంత్రి తలసాని ఘన స్వాగతం పలికారు. ఉమ్మడి దేవాలయాల కమిటీ ఛైర్మన్ ఆలే భాస్కర్‌రాజ్‌ మంత్రికి త్రిశూలాన్ని అందజేశారు. ఉప్పుగూడలో తల్వార్ టిల్లు యాదవ్ ఆధ్వర్యంలో బంగారు మైసమ్మ అమ్మవారి ఫలహారం బండి ఊరేగింపును మంత్రి తలసాని ప్రారంభించారు. బోనాల ఉత్సవాల సందర్భంగా మంత్రి తలసాని, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, మైనంపల్లి హన్మంతరావు, ఇతర నేతలు నృత్యాలు చేసి ఆకట్టుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+