Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Rain alert: తెలంగాణలోని ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన

తెలంగాణ రాష్ట్రంలో భిన్నమైన వాతావరణం కొనసాగుతోంది. వేసవి కాలం అయినప్పటికీ గత కొద్ది రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలు ప్రజలకు ఉపశమనం కలిగిస్తున్నాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండతీవ్రత ఎక్కువగా ఉంటుండగా.. సాయంత్రం నుంచి వాతావరణం ఒక్కసారిగా మారిపోతోంది. నల్లని మేఘాలు కమ్ముకుని మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ తోపాటు తెలంగాణలోని చాలా జిల్లాల్లో ఇదే పరిస్థితి కొనసాగుతోంది.

రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో భారీ ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తుండటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ అకాల వర్షాల కారణంగా చేతికి వచ్చిన పంట తడిసి ముద్దవడంతో రైతులు ఆవేదనకు గురవుతున్నారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. మరోవైపు, తెలంగాణ మరో రెండు రోజులపాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. క్యుమిలోనింబస్ మేగాల కారణంగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

Rain alert Heavy rain forecast for these districts in Telangana

శనివారం ఉరుములు మెరుపులు, ఈదురుగాలులు గంటకు 30-40 కిలోమీటర్లతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడ ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

ఏప్రిల్ 20 ఆదివారం నాడు జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, నాగర్ కర్నూల్, హైదరాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు, రానున్న మూడు రోజులపాటు ఎండలు కూడా తీవ్రంగా ఉండనున్నాయి. ప్రస్తుతం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదుకానున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలోని ఉత్తర, ఈశాన్య జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేసింది. దీంతో ఓ వైపు ఎండ తీవ్రత, మరోవైపు, మోస్తరు వర్షాలు మరికొద్ది రోజులు కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+