హైదరాబాద్‌లో జోరువాన.. మరో మూడురోజులు వాన గండం.. బెంబేలెత్తిపోతున్న జనం..

తెలంగాణ రాష్ట్రాన్ని వర్షాలు వీడటం లేదు. గత వారం రోజుల నుంచి కురుస్తోన్న వర్షాలతో జనం ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. అయితే మరో రెండు మూడు రోజలుు వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీంతో పంట చేతికొచ్చిన రైతులు, తడిసిముద్దయిన భాగ్యనగర వాసులు బెంబేలెత్తిపోతున్నారు. భారీ వర్షాలతో హైదరాబాద్ నగరంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇప్పటికీ కూడా వర్షం కురవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇంట్లో నుంచి బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది.

ఈ నెల 20వ తేదీన ఈశాన్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తెలంగాణ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న అల్పపీడన ద్రోణీ బలహీనపడిందని.. అయితే దీనికి అనుబంధంగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం 2.5 కి.మీ ఎత్తు వరకు కొనసాగుతోందని అన్నారు. అలాగే 4.5 కి.మీ నుండి 5.8 కి.మీ ఎత్తు మధ్య షీర్ జోన్ కొనసాగుతుండటంతో రాగల మూడు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుసే అవకాశాలు ఉన్నాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

rain alert in telangana for three more days

తెలంగాణ రాష్ట్రంలో మరో మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆదిలాబాద్, కొమురం భీం, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మెదక్, సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, హైదరాబాద్, రంగారెడ్డి, నారాయణపేట, యాదాద్రి భువనగిరి, నాగర్‌కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల్, నల్గొండ, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+