35 రోజుల తర్వాత హైదరాబాద్‌ను ముద్దాడిన వరుణుడు..కూల్ కూల్‌గా భాగ్యనగరం..!!
దాదాపు నెల రోజులకు పైగా పొడి వాతావరణంతో గడిపిన హైదరాబాద్ నగర వాసులకు శుక్రవారం సాయంత్రం భారీ ఉపశమనం లభించింది. నగరంలో పలు ప్రాంతాలతో పాటు సమీప జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. హఠాత్తుగా కురిసిన ఈ వర్షం భానుడి ప్రతాపం, ఉక్కపోత నుంచి ఉపశమనం అందించినప్పటికీ.. సాయంత్రం పీక్ అవర్స్‌లో ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే వాహనదారులకు తీవ్ర అంతరాయం కలిగించింది. ప్రధాన రోడ్లపై నీరు నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
తొర్రూరు, మేడిపల్లిలో అత్యధిక వర్షపాతం
తెలంగాణ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ నమోదు చేసిన గణాంకాల ప్రకారం.. శుక్రవారం సాయంత్రం 6 గంటల సమయానికి నగరంలో 10 మిల్లిమీటర్ల నుంచి 37 మిల్లిమీటర్ల వరకు వర్షపాతం నమోదైంది. రంగారెడ్డి జిల్లా అల్మాస్‌గూడ సమీపంలోని తొర్రూరు(ఆదిభట్ల)లో అత్యధికంగా 37 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదు కాగా.. మేడిపల్లిలో 33.3 మిల్లిమీటర్లు, హయత్ నగర్‌లో 30.3 మిలిమీటర్ల వర్షం కురిసింది. ఇక్కడే కాకుండా నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.

అలాగే పసుమాముల(అబ్దుల్లాపూర్ మెట్)లో 29.8 మిల్లిమీటర్లు, మౌలాలిలో 28.5 మిమీ, ఘట్‌కేసర్‌లో 27 మిల్లిమీటర్లు, పెద్ద అంబర్‌పేట్‌లో 21.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నగరంలో షేక్‌పేట్(17 మిల్లీమీటర్లు), నాచారం రాజీవ్ నగర్(15.8 మిల్లీమీటర్లు), దమ్మాయిగూడ(14 మిల్లీమీటర్లు), కాప్రా(13.5 మిల్లీమీటర్లు), నాదర్ గుల్(12.5 మిల్లీమీటర్లు), మణికొండ(11.3 మిల్లీమీటర్లు), సరూర్ నగర్(6.8 మిల్లీమీటర్లు) ప్రాంతాల్లో కూడా వర్షం కురిసింది.
స్తంభించిన వాహన రాకపోకలు
అకస్మాత్తుగా కురిసిన భారీ వర్షం కారణంగా హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలోని ప్రధాన రహదారులపై ట్రాఫిక్ వేగం దారుణంగా పడిపోయింది. సికింద్రాబాద్, బంజారాహిల్స్, గచ్చిబౌలి, జూబ్లీహిల్స్, దిల్‌సుఖ్‌నగర్ వంటి బిజీగా ఉండే ప్రాంతాల్లో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. గమ్యస్థానాలకు చేరుకోవడానికి వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగి వీటిని తొలగిస్తూ, వాహనాల రాకపోకలను క్రమబద్దీకరించారు. అయితే చాలా రోజుల తర్వాత వర్షం పడటంతో నగర ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.
Heavy rainfall lashed Hyderabad on Friday evening, causing waterlogging at several locations and slowing vehicular movement, the Hyderabad Traffic Police said.On the PVNR Expressway, waterlogging was reported at Pillar Nos. 117 and 196 on the stretch towards Aramghar. The Monsoon Emergency Team and Kulsumpura traffic staff monitored the situation at Pillar No. 117. Near Puranapool Graveyard, HYDRAA teams used motor pumps to clear the water while Falaknuma traffic personnel regulated vehicles.Traffic towards Nalgonda X Roads was also slow near Akshaya Hotel in Malakpet, and movement was affected around Praja Bhavan, where Panjagutta traffic staff were on the spot.In Banjara Hills, waterlogging at BVB and Tajmahal U-turn led police to advise commuters from Road Nos. 10 and 12 to avoid the KBR one-way route via Agrasen Island, Tajmahal U-turn, BVB and Journalist Colony until conditions improve.Police urged commuters to proceed with caution, take alternate routes and cooperate with traffic personnel.Follow for updates: https://t.co/sQoJk1XcNQ
— The Siasat Daily (@TheSiasatDaily) October 30, 2026













Click it and Unblock the Notifications
