Weather Report: తెలంగాణకు రెయిన్ అలర్ట్.. వచ్చే మూడు రోజులు వర్షాలు..!
తెలంగాణలో వచ్చే 3 రోజుల్లో తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. శని, ఆది, సోమవారాల్లో హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వాన పడే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. అక్కడక్కడ వడగళ్ల వర్షం కురువొచ్చని తెలపింది.
గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, పిడుగులు పడే అవకాశం కూడా ఉందని వివరించింది. వర్షం కురుస్తున్నప్పుడు చెట్ల కింద ఉండొద్దని సూచించింది. మార్చి 25,26 తేదీల్లో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. పగటి పూట ఎండ ఎక్కువగా ఉంటుందని, సాయంత్రానికి ఆకాశం మేఘావృతమై వానలు పడతాయని తెలిపింది.

తెలంగాణలో ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో గరిష్ఠంగా 36 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు వివరించింది.వర్షాల కారణంగా రైతులు ఇప్పటికే చాలా నష్టపోయారు. పంట కోతకొచ్చిన దశలో వర్షాలు, గాలులు రావడంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు.













Click it and Unblock the Notifications