Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

హైదరాబాద్ వాసులు జాగ్రత్త: భారీ వర్షాలకు ఇళ్లల్లోకి పాములు,ఏంచేయాలి..?

హైదరాబాద్: తెలంగాణలో భారీ వర్షాల కురుస్తున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వరదలు పోటెత్తుతున్నాయి. వరద బెడద వరంగల్‌ను ఇంకా వీడలేదు. దీంతో అక్కడి ప్రజలు ప్రాణాలు అరచేతిలో పట్టుకుని సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఇక తాజాగా భద్రకాళి చెరువు తెగడంతో వరద నీరు ఇళ్లల్లోకి వస్తోంది. అంతేకాదు వరదలో పలు విషసర్పాలు, మెసళ్లు కొట్టుకుస్తుండటంతో ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

ఇక హైదరాబాద్ పరిస్థితి అయితే అధ్వానమే. చిన్న పాటి వర్షానికే రోడ్లన్నీ చెరవులను తలపిస్తాయి. రెండ్రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు హైదరాబాద్ నగరం అతలాకుతలమైంది. హుస్సేన్ సాగర్‌లో నీరు ప్రమాదస్థాయిని చేరింది. ఇక నీళ్లు పలు కాలనీల్లోకి చేరడమే కాకుండా పలు ఇళ్లలోకి కూడా చేరాయి. భారీ వర్షాలకు విషసర్పాలు నగరంలో దర్శనమిస్తున్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయో ఏమో తెలియదు కానీ సాధారణ పాముల నుంచి కొండ చిలువలు దాకా అన్నీ జనావాసాల్లో ప్రత్యక్షమవుతున్నాయి.

rainfallhazards

కొన్ని రోజుల క్రితం నారాయపేట్ జిల్లా పసుపుల గ్రామం కృష్ణా నదీ పరీవాహక ప్రాంతంలో మొసళ్లు ప్రత్యక్షమయ్యాయి. దీనికి సంబంధిచిన వీడియోలు సైతం వైరల్ అయ్యాయి.కొన్ని నెలల క్రితం హైదరాబాద్ నగరంలోని మీరాలం ట్యాంక్ ప్రాంతంలో నివసిస్తున్నవారు ట్యాంక్‌లో మొసళ్లను చూసినట్లు ఫిర్యాదు చేశారు.


నిత్యం వర్షాలతో ఈ ఘటనలను దృష్టిలో ఉంచుకుని తగు జాగ్రత్తలు నగరవాసులు తీసుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది. ఇలాంటి సమయాల్లో పాములు, మొసళ్లు, ఇతర క్రూర జంతువులు జనవాసాల్లోకి ప్రవేశిస్తాయని హెచ్చరిస్తోంది. ఇలాంటివి కనిపిస్తే వెంటనే అటవీశాఖ కార్యాలయానికి ఫోన్ చేయాలని ప్రభుత్వం సూచించింది.ఇందుకోసం 1800 425 5364 అనే ఈ ఫోన్‌ నెంబర్‌కు ఫోన్ చేయాలని చెప్పింది.


ఒక వేళ పాములు వస్తే ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ సొసైటీకి ఫోన్ చేయాలని పేర్కొంది. 8374233366 ఫోన్ నెంబర్‌కు చేస్తే వెంటనే సిబ్బంది వచ్చి పాముని పట్టుకుని దూరంగా వదిలేస్తారని వెల్లడించింది.ఒక వేళ మొసళ్లను చూస్తూ 1800 425 5364 నెంబర్‌కు కాల్ చేయాల్సిందిగా పేర్కొంది.మరే ఇతర క్రూర జంతువులు కనిపించినా 9697887888 నెంబర్‌కు కాల్ చేస్తే యానిమల్ వారియర్స్ వస్తారని వివరించింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+