Rains: తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు.. మరో 24 గంటలు భారీ వర్షాలు కురిసే అవకాశం..
తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ లో వర్షం మళ్లీ మొదలైంది. ఉదయం కాస్త తెరుపునిచ్చిన వర్షం ఉదయం 8 గంటల 30 నిమిషాలకు మళ్లీ మొదలైంది. వర్షంతో రోడ్లపై నీరు చేరింది. దీంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఆఫీస్ లకు వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం పాఠశాలలకు సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే. మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తోన్నాయి.
చాలా గ్రామాల్లో చెరువులు నిండి అలుగు పారుతున్నాయి. వరంగల్ లో కురిసిన భారీ వర్షానికి ఇళ్లలోకి నీరు చేరింది. మరోవైపు భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి పెరిగింది. అక్కడ మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో కూడా వానలు పడుతున్నాయి. బెజ్జూరులో అత్యధికంగా 25.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కూడా వర్షాలు పడుతున్నాయి. బెజ్జంకి మండలం దేవక్కపల్లి మోయదుమ్మ వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఆంధ్రపదేశ్ లో కూడా వర్షాలు కురుస్తున్నాయి.

మన్యం, అల్లూరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో వానలు పడుతున్నాయి. రాష్ట్రంలో 3 రోజులు ముసురు వాతావరణం ఉంటుందని వెల్లడించింది. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలపై మినిట్ టూ మినిట్ అప్ డేట్ మీ కోసం...
నిండుకుండలా హుస్సేన్ సాగర్..!!#HussainSagar #HydRains #HyderabadRains #TelanganaRains #Oneindiatelugu pic.twitter.com/KuK1aDGspW
— oneindiatelugu (@oneindiatelugu) July 21, 2023
⚠️గోదావరికి పెరుగుతున్న వరద ఉధృతి
— Andhra Pradesh State Disaster Management Authority (@APSDMA) July 21, 2023
⚠️భద్రాచలం వద్ద నీటిమట్టం 43.9 అడుగులు
⚠️పోలవరం వద్ద 11.97మీటర్లకు నీటిమట్టం
⚠️ధవళేశ్వరం వద్ద ప్రస్తుత ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 8.48 లక్షల క్యూసెక్కులు
🚩ఈరోజు మొదటి ప్రమాద హెచ్చరిక జారిచేసే అవకాశం
⚠️నది పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. pic.twitter.com/oJqAUG5CWo
మునిగిన చాకలపాలెం-కనకాయలంక కాజ్వే భీమవరం-కోనసీమ జిల్లాల మధ్య రాకపోకలు బంద్ pic.twitter.com/cHCBmmeIOV
— oneindiatelugu (@oneindiatelugu) July 21, 2023












Click it and Unblock the Notifications