Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Rains: చల్లని కబురు అందించిన వాతావరణ శాఖ.. పలు జిల్లాలకు వర్షసూచన..

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. వడగాలులు వీయడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. శనివారం భారీగా ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.11 జిల్లాల్లో టెంపరేచర్లు 44 డిగ్రీల సెల్సియస్​ పైగానే రికార్డయ్యాయి. 13 జిల్లాల్లో 43 డిగ్రీలకుపైగా, 8 జిల్లాల్లో 42 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రత నమోదయ్యాయి.హైదరాబాద్ ​లో 41.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. పలు ప్రాంతాల్లో భారీగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గరిమెళ్లపాడు, సూర్యాపేట జిల్లా పెన్​పహాడ్, నల్గొండ జిల్లా నాంపల్లిలో అత్యధికంగా 44.5 డిగ్రీల గరిష్ట రికార్డు అయింది.

మరిపెడ, మేడారం, హాజీపూర్, ఎల్కపల్లిలో 44.4 డిగ్రీలు, ముదిగొండ, కన్నయ్యపల్లి 44.3, కోల్వాయి 44.1, వీణవంక 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యాయి. పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, యాదాద్రి భువనిరి, సిద్దిపేట, జయశంకర్ భూపాలపల్లిలో 43.5 డిగ్రీలకు పైగా టెంపరేచర్లు రికార్డు అయ్యాయి. జనగామ, జోగులాంబ గద్వాలలో 43.7, వరంగల్, నిర్మల్​లో 43.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. సంగారెడ్డి 42.5, కామారెడ్డి 42.1 లో 41.8 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Rains are likely to occur in many districts of Telangana for five days from today

ఆదివారం కూడా భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దక్షిణ తెలంగాణలో వేడీ తీవ్రత భారీగా నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఆదివారం నుంచి ఐదు రోజుల పాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో కూడిన వానలు పడతాయని వివరించింది. కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల జిల్లాలతో పాటు జనగామ, సిద్దిపేట, మెదక్​, కామారెడ్డి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది.

మంచిర్యాల, పెద్దపల్లి, ములుగు, భద్రాద్రికొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో అత్యధికంగా టెంపరేచర్ల నమోదవుతున్నాయి. నల్గొండ జిల్లాలోని 30 మండలాలు, సూర్యాపేటలోని 18 మండలాలు, భద్రాద్రిలోని 19 మండలాలు, ఖమ్మంలోని 18, మంచిర్యాలలోని 11 మండలాలు, పెద్దపల్లి జిల్లాలోని 10 మండలాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+