Weather Update: వచ్చే రెండు రోజులు తెలంగాణలో వర్షాలు..

నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతోన్నాయి. రెండు మూడు రోజుల్లో ఏపీ, తెలంగాణలో పూర్తిగా వ్యాపించే అవకాశం ఉంది. దీంతో వచ్చే మూడు రోజుల్లో తెలంగాణతో పాటు ఏపీలో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. రుతుపవనాలు ఇప్పటికే రాయసీమలోకి ప్రవేశించినట్లు తెలుస్తోంది. దీంతో తిరుపతిలో మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు 8.82 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదు అయింది.

రుతుపవనాల కారణంగా బంగాళాఖాతం నుంచి భారీ మేఘాలు ఏపీ, తెలంగాణకు వచ్చే అకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. తెలంగాణలో పలు జిల్లాల్లో వానలు పడే అవకాశం ఉంది. శుక్రవారం వికారాబాద్, గద్వాల, నారాయణపేట, వనపర్తి, నాగర్ కర్నూలు, సంగారెడ్డి, ఆదిలాబాద్, సూర్యాపేట, నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

Rains are likely to occur in many districts of Telangana for the next two days

వర్షాలు కురిసే సమయంలో ఈదురుగాలులు, మెరుపులు, పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. దక్షిణ కోస్తాంధ్ర, ఉత్తర తమిళనాడు ప్రాంతంలో నైరుతి బంగాళాఖాతంలో ఆవహించిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రుతుపవనాలు చురుగ్గా కదిలే అవకాశం ఉందని వివరిస్తున్నారు. బుధవారం సాయంత్రం హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.

మాదాపూర్, జూబ్లీహిల్స్, యూసఫ్ గూడ, మోతినగర్, బొరబండ, అయ్యప్ప సోసైటీ, హైటెక్ సిటీ ప్రాంతాల్లో వర్షం కురిసింది. దీంతో చాలా చోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+