Weather: తెలంగాణకు చల్లని కబురు చెప్పిన ఐఎండీ..!

తెలంగాణకు భారత వాతావరణ శాఖ(IMD) శుభవార్త చెప్పింది. వచ్చే నాలుగు రోజులు తెలంగాణ వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశం ఉందని పేర్కొంది. అధిక ఉష్ణోగ్రతలతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు వర్షాలు పడడంతో ఉపశమనం పొందే అవకాశం ఉంది. వానలతో ఉష్ణోగ్రతలు కూడా తగ్గుతాయని వివరించింది. వివిధ జిల్లాల్లో గురువారం వరకు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

సోమవారం నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లోని పలు చోట్ల ఉరుములు, మెరుపులతో వానలు పడే అవకాశం ఉందని పేర్కొంది. పలు చోట్ల వడగళ్ల వానకు ఛాన్స్ ఉందన్నారు. మంగళవారం నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సిద్దిపేట, జనగామ, మహబూబాబాద్, ములుగు, వరంగల్, హన్మకొండ, కరీంనగర్, భూపాలపల్లి, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాలో ఉరుములు, మెరుపులతో వానలు పడే అవకాశం ఉంది.

Rains in Telangana for the next four days

ఏప్రిల్ 10న రంగారెడ్డి,వికారాబాద్, మల్కాజిగిరి, మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్ తో పాటు హైదరాబాద్ లో కూడా తేలిపాటి వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో శనివారం ఎండలు మండిపోయాయి. ఆదివారం కాస్త ఎండ తక్కువ అయినప్పటికీ.. వేడితో ప్రజలు ఇబ్బంది పడ్డారు. వానలు పడితే ఉష్ణోగ్రతలు తగ్గుతాయని వాతావరణ శాఖ తెలిపింది.

వర్షాల తర్వాత మళ్లీ ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. ఈసారి ఏప్రిల్, మే నెలల్లో భారీగా ఎండలు ఉంటాయని చెప్పింది. ఎండ వేడి కారణంగా పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+