తెలంగాణలో మరో 3 రోజులు వర్షాలు! కానీ, ఎండలు మాత్రం తగ్గేదేలే

తెలంగాణ రాష్ట్రంలో ఓ వైపు తీవ్రమైన ఎండలు.. మరోవైపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా, రాష్ట్రంలో రానున్న మూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకావం ఉందని పేర్కొంది. అంతేగాక, 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది.

వర్షాలు కురిసే అవకాశం ఉన్నప్పటికీ.. ఉష్ణోగ్రతలు కూడా ఎక్కువగానే ఉండనుందని చెప్పింది. రాగల మూడు రోజుల్లో మధ్యాహ్నం సమయంలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తన ప్రకటనలో వెల్లడించింది.

Rains to continue for another three days in Telangana

శుక్రవారం పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో ఉన్న ఉపరితల ఆవర్తనం శనివారం బలహీనపడిందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశముందని వెల్లడించింది.

కాగా, గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో అక్కడక్కడా వర్షాలు పడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ తోపాటు ఉత్తర తెలంగాణలోని నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. కొన్ని చోట్ల ఈదురుగాలులు, వడగళ్లతో కూడిన వానలు రైతులకు తీవ్ర నష్టం కలిగించాయి. దీంతో చేతికి వచ్చిన పంట తమకు దక్కకుండా పోతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+