Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తెలంగాణలో ప్రభాస్ 'రాజాసాబ్' కు పెద్ద షాక్..!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాజాసాబ్ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 9 న విడుదల కానుంది. అయితే జనవరి 8 న ఏపీలో ప్రీమియర్స్ కు అక్కడి ప్రభుత్వం ఇచ్చింది. అయితే తెలంగాణలో మాత్రం ప్రభుత్వం నుంచి జీవో రాలేదు. దాంతో కేవలం మీడియాకు బాలానగర్ విమల్ థియేటర్ లో షో వేస్తున్నట్లు సమాచారం రావడంతో ఫ్యాన్స్ ఒక్కసారిగా భారీ సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. దీంతో థియేటర్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దాంతో మీడియాకు వేయాల్సిన షో రద్దయ్యే అవకాశం ఏర్పడింది.

అయితే మూవీని చూసేందుకు థియేటర్ లోపలికి ఫ్యాన్స్ కూడా భారీ సంఖ్యలో వెళ్లడంతో అందరినీ బయటకు పంపించేశారు. దాంతో వి వాంట్ జస్టిస్ అంటూ థియేటర్ ముందు ఫ్యాన్స్ ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో పోలీసులు లాఠీ ఛార్జ్ చేసి వాళ్లను అక్కడి నుంచి క్లియర్ చేశారు. అయితే ప్రస్తుతం ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

Raja Saab Premiere Turns Tense Lathi Charge at Hyderabad s Vimal Theatre Amid Massive Crowd Rush

మరోవైపు తెలంగాణలో రాజాసాబ్ మూవీ బుకింగ్స్ ప్రారంభమైనట్లు మూవీ టీమ్ ప్రకటించింది. ఈ రోజు రాత్రి 11 గంటల 30 నిమిషాల నుంచి ప్రీమియర్ షోస్ కు సంబంధించి టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్ లో అందుబాటులోకి రానున్నట్లు తెలిపింది. ప్రస్తుతం మూడు థియేటర్ల టికెట్లు యాప్ లో చూపిస్తున్నాయి. ఇక మరికొన్ని గంటల్లో ప్రపంచవ్యాప్తంగా రెబల్ సునామీ స్టార్ట్ కానుంది. జనవరి 9 న ప్రపంచవ్యాప్తంగా మూవీ రిలీజ్ కు సిద్ధమైంది.

మరోవైపు తెలంగాణలో ప్రభాస్ రాజాసాబ్ కు పెద్ద షాకే తగిలింది. టికెట్ ధర పెంపునకు తెలంగాణ ప్రభుత్వం నిరాకరించింది. దీంతో రాజాసాబ్ మూవీ టికెట్స్ సాధారణ ధరలకే లభిస్తున్నాయి. టికెట్ రేట్ల పెంపునకు ఆమోదం లభిస్తుందని చివరి వరకూ ఆశించినా.. తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో కఠినంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఏపీలో రాజాసాబ్ సినిమాకు టికెట్ల రేట్ల పెంపునకు అక్కడి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+