సజ్జనార్‌పై సీబీఐ దర్యాప్తు చేయించాలి- రాజాసింగ్ సంచలనం..!!
సీనియర్ ఐపీఎస్ అధికారి సజ్జనార్ పై ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన లేఖ రాసారు. నగర పోలీసు కమిషనర్ గా పని చేసిన సజ్జనార్ పైన అనుమానాలు, అసంతృప్తి వ్యక్తం చేశారు. సజ్జనార్‌పై స్వతంత్ర దర్యాప్తు లేదా సీబీఐతో దర్యాప్తు చేయించాలని సీఎం రేవంత్ రెడ్డికి రాజాసింగ్ రాసిన లేఖ సంచలనంగా మారింది. సజ్జనార్ హయాంలో నమోదైన కేసులు, కేసుల దర్యాప్తులో పారదర్శ కత అనుమానాలుండటంతోపాటు పెండింగ్ కేసులపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తేవాలని ఆ లేఖలో రాజాసింగ్ డిమాండ్ చేసారు.
హైదరాబాద్ పోలీసు కమిషనర్ గా బాధ్యతలు నిర్వహించి బదిలీ అయిన సజ్జనార్ పైన ఎమ్మెల్యే రాజాసింగ్ రాసిన లేఖ సంచలనంగా మారింది. లేఖలో పలు కీలక అంశాలను రాజాసింగ్ ప్రస్తావన చేసారు. సజ్జనార్ సీపీగా విధులు నిర్వహణ పైన రాజాసింగ్ పలు సందేభాలు వ్యక్తం చేసారు. వెలుగు లోకి వచ్చిన బంగారం చోరీ, ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో దర్యాప్తు దారి మళ్లిందనే అనుమానాలపై స్వతంత్ర దర్యాప్తు చేయాలన్నారు. కర్ణాటకలోని సజ్జనార్ సొంతూరిలో 100 ఎకరాల భూమి కొన్నట్లు వస్తున్న ఆరోపణలపై కూడా విచారించాలని లేఖలో కోరారు. ఇటీవల సీబీఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వర్రావు సజ్జనార్‌పై చేసిన ఆరోపణలను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. ఆస్తుల వివరాలు, ఆదాయ వనరులు, ఆర్థిక లావాదేవీలను పరిశీలించి ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయా? అన్నది తే ల్చాలని డిమాండ్ చేశారు.

రేవంత్ కు లేఖలో కీలక అంశాలు
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెలుగులోకి వచ్చిన తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కుంభకోణం దర్యాప్తు దారి మళ్లిందనే తీవ్ర ఆందోళనలు ఉన్నాయని రాజా సింగ్ పేర్కొన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డితో సహా ఉన్నతాధికారుల ప్రమేయంపై ఆరోపణలు, ఎఫ్ఐఆర్ నమోదైనా విచారణ పురోగతిపై ప్రశ్నలు తలెత్తుతున్నాయన్నారు. అప్పటి సీపీ సజ్జనార్ పాత్రపై కూడా స్వతంత్ర విచారణ అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. అదే విధంగా బంగారం చోరీ కేసులో ఎలాంటి పురోగతి లేదని, ఇప్పటివరకు అరెస్టులు ఎందుకు జరగలేదని ప్రశ్నించారు. దర్యాప్తును ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేయడానికి, వాస్తవాలను తొక్కి పెట్టడానికి ఏవైనా ప్రయత్నాలు జరిగాయా అనేది తేల్చాలన్నారు. ఆయన హయాంలో నమోదైన హామ్వే కేసులో కూడా తీవ్రమైన ఆరోపణలు ఉన్నప్పటికీ, దర్యాప్తులో ఆశించిన పురోగతి లేదని లేఖలో ప్రస్తావించారు. విచారణలో జాప్యానికి గల కారణాలను స్వతంత్రంగా పరిశీలించాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications
