పదవులు మీకే , పైసలు మీకే - కోమటిరెడ్డి సంచలనం..!!
తెలంగాణ కాంగ్రెస్ లో కోమటిరెడ్డి కామెంట్స్ కొనసాగుతున్నాయి. తనకు మంత్రి పదవి ఇస్తారనే హామీ విస్మరించటం పైన రాజగోపాల్ రెడ్డి ఆగ్రహంగా ఉన్నారు. నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ లక్ష్యంగా చేస్తున్న వ్యాఖ్యలు సంచలనంగా మారుతున్నాయి. ఇప్పటికే పార్టీ క్రమశిక్షణా సంఘం రాజగోపాల్ రెడ్డితో మాట్లాడాలని డిసైడ్ అయింది. రేవంత్ లక్ష్యంగా చేస్తున్న వ్యాఖ్యలతో పార్టీలో చర్చ సాగుతోంది. అయినా, రాజగోపాల్ రెడ్డి తన వ్యాఖ్యలను కొనసాగిస్తున్నారు. మరోసారి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేసారు. సీఎం రేవంత్ పైన నేరుగా చేస్తున్న వ్యాఖ్యలు పార్టీకి సమస్యగా మారుతున్నాయి. తనకు మంత్రి పదవి ఇస్తామని పార్టీ చేరే సమయం లో హామీ ఇచ్చి అమలు చేయకపోవటం పైన నిలదీస్తున్నారు. తనకు మంత్రి పదవి అడ్డుకోవటం పైన మండి పడుతున్నారు. రేవంత్ ఒక సభతో తానే పదేళ్లు సీఎంగా ఉంటానని చెప్పని అంశాన్ని రాజగోపాల్ రెడ్డి తప్పుబట్టారు. మీడియా పైన రేవంత్ చేసిన వ్యాఖ్యలతోనూ విభేదించారు. ఇక, కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరూ సమర్ధులేనని.. ఇద్దరికీ మంత్రి పదవి ఇవ్వటం తప్పేంటని ప్రశ్నించి న రాజగోపాల్.. ఖమ్మంకు మూడు మంత్రి పదవులు ఇవ్వలేదా అని నిలదీసారు.

ఇక, ఇప్పుడు తాజాగా మరోసారి కోమటిరెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. పైసలు, నిధులు అన్నీ మీకేనా అంటూ రేవంత్ రెడ్డిని నిలదీశారు. గత 20 నెలలుగా మునుగోడు నియోజకవర్గంలో రోడ్లు, భవనాల నిర్మాణాల కోసం ఒక్క రూపాయి కూడా నిధులు రాలేదని రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. మంత్రిని వందసార్లు కలిసినా ఫలితం లేదని చెప్పారు. ఇదే పరిస్థితి కొనసాగితే.. ప్రభుత్వాన్ని ప్రశ్నించక తప్పదని తేల్చి చెప్పారు. పదవులు మీరే తీసుకుంటున్నారు.. నిధులు మీకే తీసుకుంటారా అంటూ నిలదీసారు. తాను ముఖ్యమంత్రిని కానీ, పార్టీని కానీ విమర్శించడం లేదని, మునుగోడు నియోజకవర్గానికి నిధులు రావడం లేదనే ఆవేదనతోనే మాట్లాడుతున్నానని చెప్పుకొచ్చారు. తనకు మంత్రి పదవి వస్తే మునుగోడు ప్రజలకు న్యాయం జరుగుతుందని చెప్పారు.












Click it and Unblock the Notifications