సారిక మృతి: సెల్‌ఫోన్ బయట ఎందుకు?, అజ్ఞాతంలో రెండో భార్య సన, హైద్రాబాద్‌లో..

వరంగల్: వరంగల్ మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాజయ్య కోడలు సారిక, ఆమె ముగ్గురు పిల్లల అనుమానాస్పద మృతి కేసులో పోలీసులు సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. పడక గదిలో ఉండాల్సి ఫోన్ బయటకు ఎలా వచ్చిందోనని పోలీసులు ఆరా తీస్తున్నారు.

ఫోన్‌ను బయట ఆమె మర్చిపోయిందా లేక ఏమైనా జరిగిందా అని ఆలోచిస్తున్నారు. ఫోన్ లాక్ ఓపెన్ చేసేందుకు పోలీసులు తికమక పడుతున్నారు. దీనిని ఎఫ్ఎస్‌ఎల్‌కు పరీక్షల నిమిత్తం పంపించారు. అందులో ఎవరెవరి కాల్స్ ఉన్నాయి? అనే విషయం ఆరా తీయనున్నారు.

రాజయ్య ఇంట్లో బుధవారం అగ్నికి ఆహుతైన ఆయన కోడలు సారిక, మనవలు అభినవ్‌, అయాన్‌, శ్రీయాన్‌లది హత్యా? ఆత్మహత్యా? అనేది ఇంకా తేలడం లేదు. సమాచారం ప్రకారం ఈ నలుగురూ అరగంట పాటు అగ్నికీలల్లో చిక్కుకుపోయి మృత్యువాతపడ్డారు.

Rajaiah's daughter in law death: Police seized cell phone

సుమారు 100 డిగ్రీల సెల్సియస్‌ కంటే ఎక్కువ ఉష్ణోగ్రత మధ్య ఆ శరీరాలన్నీ కాలి బొగ్గయ్యాయని శవపరీక్ష నిర్వహించిన వైద్యులు అభిప్రాయపడుతున్నట్లుగా తెలుస్తోంది. సమాచారం మేరకు తెల్లవారుజామున సుమారు 3గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు.

గ్యాస్‌ లీకైనా, ఏదైనా ఇంధనం వినియోగించినా ఆ వాసనను వారి దుస్తులు గ్రహించే అవకాశముంది. దీంతో దుస్తుల నమూనాల్ని సేకరించారు. వారు తిన్న భోజనంలో విషం కలిపి ఉండొచ్చన్న ఆరోపణల నేపథ్యంలో కడుపులోని నమూనాల్ని కూడా సేకరించారు. ఈ రెండు నమూనాల్ని ఫోరెన్సిక్‌ ల్యాబ్ పంపించారు.

100 డిగ్రీల సెల్సియస్‌కు మించిన వేడే వారి శరీరాల్ని తాకిందని, ఎముకలు పట్టుకుంటుంటే విరిగిపోయేలా ఉన్నాయని తెలుస్తోంది. కాగా, తెలంగాణ విశ్వబ్రాహ్మణ సంఘం, స్వర్ణకారుల సంఘం సహకారంతో అంత్యక్రియలు నిర్వహించారు.

పరారీలో సన కుటుంబం

అనిల్ రెండో భార్య సన పరారీలో ఉన్నట్లుగా తెలుస్తోంది. అనిల్ - సనల వివాహేతర సంబంధం, రెండో పెళ్లి నేపథ్యంలోనే సారికతో విభేదాలు వచ్చినట్లుగా తెలిసిందే. ఈ నేపథ్యంలో సనను పోలీసులు అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

సారిక కేసులో పోలీసులు సనను ఏ4 నిందితురాలిగా చేర్చారు. ఏ4 నిందితురాలైన ఆమె కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. సన వరంగల్లో లేకపోవడంతో ఆమెను వెతుక్కుంటూ పోలీసులు హైదరాబాద్ వచ్చారు.

హైదరాబాదులోని కనిపించలేదు. సన, ఆమె తల్లి పరారీలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆమె హైదరాబాదులోనే ఉన్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం సన అజ్ఞాతంలో ఉన్నారు. సన గురించి రెండు పోలీసు బృందాలు వెతుకుతున్నాయి. సన బంధువులు, స్నేహితుల ఇళ్లల్లో వెతుకుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+