ఈ ప్రశ్న ఊహించలేదు, కసబ్ కంటే పెద్దది కాదు: శిరీష కేసుపై లాయర్

బ్యూటీషియన్ శిరీష ఆత్మహత్య కేసులో నిందితులు రాజీవ్, శ్రవణ్‌లను పోలీసులు సోమవారం తమ కస్టడీకి తీసుకున్నారు. ఈ సందర్భంగా లాయర్ వెంకట్ విలేకరులతో మాట్లాడారు.

హైదరాబాద్: బ్యూటీషియన్ శిరీష ఆత్మహత్య కేసులో నిందితులు రాజీవ్, శ్రవణ్‌లను పోలీసులు సోమవారం తమ కస్టడీకి తీసుకున్నారు. ఈ సందర్భంగా లాయర్ వెంకట్ విలేకరులతో మాట్లాడారు.

రాజీవ్, శ్రవణ్‌లపై థర్డ్ డిగ్రీ ఉపయోగించకుండా విచారణ చేపట్టాలని న్యాయస్థానం ఆదేశించిందని చెప్పారు. ఎంతమంది పోలీసులు వారిని విచారిస్తారని విలేకరులు అడగగా.. ఇలాంటి ప్రశ్నలు వేస్తారని నేను ఊహించలేదని, అందుకే లోపల పోలీసులు ఎంత మంది ఉన్నారో కౌంట్ చేసుకోలేదని అన్నారు.

అనుమానాలు నివృత్తి చేసుకునేందుకే..

అనుమానాలు నివృత్తి చేసుకునేందుకే..

విచారణలో తన సహకారం అవసరమైతే వెళ్తానని లాయర్ చెప్పారు. పోలీసులు పర్‌ఫెక్టుగా విచారణ చేస్తున్నారని చెప్పారు. శిరీష మృతి కేసులో తమ అనుమానాలను నివృత్తి చేసుకునేందుకే పోలీసులు రాజీవ్, శ్రవణ్‌లను కస్టడీకి అడిగారని చెప్పారు.

ఇలాంటి కేసు..

ఇలాంటి కేసు..

తన సర్వీసులో ఇంత త్వరగా విచారణ జరిపిన కేసు చూడలేదని లాయర్ అన్నారు. కేసులో రాజీవ్ తప్పు లేదని అభిప్రాయపడ్డారు. పోలీసుల విచారణ తర్వాత అన్ని విషయాలు వెలుగు చూస్తాయని చెప్పారు.

కసబ్ కేసు కంటే పెద్దది కాదు

కసబ్ కేసు కంటే పెద్దది కాదు

కేసులో న్యాయ సాయంపై స్పందిస్తూ.. ముంబైలో దాడులకు పాల్పడ్డ పాక్ ఉగ్రవాది కసబ్ కేసు కంటే శిరీష మృతి కేసు పెద్దది ఏమీ కాదని ఆ న్యాయవాది అన్నారు. కసబ్ లాంటి వాడికే న్యాయ సాయం అందిందన్నారు. పోలీసుల విచారణలో అన్నీ వెలుగు చూస్తాయని చెప్పారు. శిరీష పైన అత్యాచారం జరగలేదన్నారు. వారు తాగి ఉన్నారు కాబట్టి స్పష్టంగా ఏం జరిగిందో తెలియదన్నారు.

తేజస్విని గురించి సరికాదు

తేజస్విని గురించి సరికాదు

ఈ కేసులో తేజస్విని గురించి మాట్లాడుకోవడం అంత కరెక్ట్ కాదని లాయర్ అన్నారు. తేజస్విని ఎదుట పోలీసులు విచారించడం లేదని చెప్పారు. నందు, నవీన్‌ల అందరికీ కామన్ ఫ్రెండ్స్ అని చెప్పారు. తలపై కొట్టి చంపారని శిరీష తల్లిదండ్రులు అంటున్నారని మీడియా ప్రశ్నించగా.. విచారణలో అన్నీ తేలుతాయని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+