విచారణలో ప్రియుడు ఇలా, 'పలువురితో చనువు, జల్సాలకు అలవాటుపడ్డ స్వాతి!' జైల్లో ఇలా
Recommended Video

హైదరాబాద్: కాంట్రాక్టర్ సుధాకర్ రెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడు రాజేష్‌ను గురువారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు చేసే సమయంలో ఆయన మీడియాతో పొడిపొడిగా మాట్లాడాడు. పోలీసుల విచారణలోను ఆసక్తికర విషయాలు వెల్లడించాడని తెలుస్తోంది.
తనను స్వాతి ఆర్థికంగా ఆదుకున్నదని కూడా చెప్పాడని తెలుస్తోంది. రాజేష్ ఓ ఫిజియోథెరపీ సెంటర్‌లో సాధారణ వేతనానికి పని చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో స్వాతినే అతనిని ఆర్థికంగా ఆదుకున్నట్లుగా చెప్పాడు. తనకు ఎన్నో విధాలుగా డబ్బుల పరంగా సాయం చేసినట్లు చెప్పాడు.

స్వాతి ఆర్థికంగా ఆదుకుంది, స్టోరీలు చెప్పేది
స్వాతి ఇచ్చిన డబ్బులతోనే దుస్తులు కొనుక్కునేవాడిని అని రాజేష్ విచారణలో వెల్లడించాడని తెలుస్తోంది. స్వాతి టీవీ సీరియల్స్ బాగా చూసేదని, చాలాసార్లు తనకు స్టోరీలు చెప్పేదని తెలిపాడు. స్వాతి ఎవడు సినిమా మాదిరిగా రాజేష్‌కు ప్లాస్టిక్ సర్జరీ చేయించాలని భావించిన విషయం తెలిసిందే.

స్వాతి చెప్పినట్లే చేశా
సుధాకర్ రెడ్డి హత్య విషయంలో స్వాతి చెప్పినట్లే తాను చేశానని రాజేష్ పోలీసుల విచారణలో వెల్లడించాడు. పోలీసులు గురువారం ఉధయం అతనిని కంచన్‌బాగ్‌లోని డీఆర్డీఓ ఆసుపత్రి నుంచి తరలించారు. అనంతరం అతనిని విచారించారు. కోర్టులో ప్రవేశ పెట్టనున్నారు.

ఖైదీ నెంబర్ 678
పథకం ప్రకారం కట్టుకున్న భర్తను దారుణంగా హతమార్చిన స్వాతి ప్రస్తుతం పాలమూరు జైల్లో రిమాండు ఖైదీగా ఉన్నది. అయితే ఆమె ముఖంలో ఎలాంటి పశ్చాత్తాపం కనిపించడం లేదని తెలుస్తోంది. తోటి ఖైదీలకు దూరంగా ఉంటోంది. స్వాతికి జైలు అధికారులు 678 ఖైదీ నెంబర్ కేటాయించారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం పూర్తి చేసిన ఆమె తోటి ఖైదీలతో కలిసి జైల్లో గడ్డి కోసింది.

మొదటి నుంచి జల్సాలకు అలవాటుపడ్డ స్వాతి
స్వాతి వ్యవహారం మొదటి నుంచి అనుమానాస్పదంగానే ఉందని పోలీసుల విచారణలో బయటపడింది. నర్సింగ్ శిక్షణ పొందిన స్వాతి ఆ సమయంలో పలువురితో చనువగా మెలిగేదని అంటున్నారు. జల్సాలకు ఎక్కువగా అలవాటు పడిన స్వాతిని పద్ధతి మార్చుకోవాలని భర్త తరుచూ చెప్పేవాడని అంటున్నారు.

అడ్డు తొలగించుకొని
అయితే మూడు నెలల నుంచే సుధాకర్ రెడ్డిని అడ్డు తొలగించుకునేందుకు స్వాతి, ఆమె ప్రియుడు రాజేష్ పథకం రచిస్తూ వచ్చారని తెలుస్తోంది. కట్టుకున్న భర్త, కన్నబిడ్డలకను కాదనుకొని ప్రియుడితో పుణేకు వెళ్లిపోవాలనే ఉద్దేశ్యంతో స్వాతి.. సుధాకర్ రెడ్డిని కిరాతకంగా హత్య చేసింది.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications