సీఎం కేసీఆర్ బయోపిక్! సిద్ధమైన కథ, కేసీఆర్ పాత్రలో బాలీవుడ్ నటుడు?
మలిదశ తెలంగాణ ఉద్యమ సారథి, తెలంగాణ జాతిపితగా పేరుగాంచిన వాడు, తెలంగాణ రాష్ట్రానికి ప్రథమ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై త్వరలోనే ఓ సినిమా నిర్మించబోతున్నారు.
హైదరాబాద్: మలిదశ తెలంగాణ ఉద్యమ సారథి, తెలంగాణ జాతిపితగా పేరుగాంచిన వాడు, తెలంగాణ రాష్ట్రానికి ప్రథమ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై త్వరలోనే ఓ సినిమా నిర్మించబోతున్నారు. అయితే కేసీఆర్ పాత్రలో ఎవరు నటిస్తారు? అన్న అంశంపై ఇప్పటి వరకు నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది.
ఈ విషయమై చిత్ర నిర్మాత రాజ్ కందుకూరి శుక్రవారం ఒక ప్రకటన చేశారు. సినిమాలో కేసీఆర్ పాత్రను పోషించేందుకు బాలీవుడ్ నటుడు రాజ్‌కుమార్ రావునే ఎంపిక చేసినట్లు స్పష్టం చేశారు. ప్రముఖ సినిమాల్లో నటించి తన నటనను నిరూపించుకొని మంచి నటుడిగా పేరు తెచ్చుకున్న రాజ్ కుమార్ రావు.. తెలంగాణ పునర్నిర్మాణ చిత్రానికి కథానాయకుడిగా నటించబోతున్నాడు.

తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ పోషించిన కీలక పాత్ర, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించేందుకు ఆయన చేసిన కృషి, పోరాటం, చిన్నతనం నుంచి ఇప్పటి వరకు వివిధ స్థాయిల్లో ఆయన ఎదుగుదల, రాజకీయ ప్రస్థానం, ముఖ్యమంత్రిగా అభివృద్ధికి వేస్తున్న బాటలు, ప్రజల ఆదరాభిమానాలు చూరగొంటున్న తీరు, భావితరాల కోసం శాశ్వత కార్యాచరణ ప్రణాళిక, దాని అమలుకు దిశానిర్దేశాలు, తదితర అంశాలన్నీ ఈ చిత్రం ద్వారా అన్నీ కళ్లకు కట్టినట్లు చూపించబోతున్నారు.
దీనికోసం కేసీఆర్ పుట్టిన ఊరు దుబ్బాకకు వెళ్లి స్థానిక నాయకులతో మాట్లాడి చిత్ర నిర్మాణానికి తగిన వ్యూహాలను రచిస్తున్నట్లు నిర్మాత రాజ్ కందుకూరి వెల్లడించారు. రాష్ట్ర ప్రతిష్టతో ముడిపెట్టుకున్న ఈ చిత్రానికి బడ్జెట్ ఎంతైనా రాజీపడకుండా, ప్రేక్షకులు, తెలంగాణ ప్రజల మనసును దోచుకునేలా రూపొందిస్తున్నట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications