హైదరాబాద్‌లో "రాజు వెడ్స్ రాంభాయి" మూవీ రిపీట్.. యువతికి హెచ్‌ఐవీ ఇంజెక్షన్‌ !!

తెలంగాణ రాష్ట్రంలో జరిగిన యధార్ధ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రం "రాజు వెడ్స్ రాంభాయి". రీసెంట్ గానే విడుదలైన ఈ సినిమాలో హీరోయిన్‌కు ఆమె తండ్రే హెచ్‌ఐవీ సోకిన రక్తం ఇంజెక్షన్ ఇవ్వడం కథలో కీలక సన్నివేశంగా ఉంటుంది. ప్రేమించిన వ్యక్తిని మర్చిపోకపోవడంతో కోపంతో కూతురినే చంపాలని ప్రయత్నించే తండ్రి పాత్ర అందులో కనిపిస్తుంది. అయితే ఇప్పుడు అలాంటి ఘటన నిజ జీవితంలో చోటుచేసుకోవడం కలకలం రేపుతోంది. ఈ దారుణ ఘటన హైదరాబాద్ నగర పరిధిలోని పోచారం ప్రాంతంలో చోటుచేసుకుంది. అయితే ఆ మూవీలో తండ్రి అలా చేస్తే.. ఇక్కడ మాత్రం యువతి పెళ్లికి నిరాకరించిందని ఓ యువకుడు ఈ ఘాతుకానికి పాల్పడటం మరింత సంచలనంగా మారింది.

పెళ్లి నిశ్చయమై తర్వాత వెలుగులోకి వచ్చిన నిజం..

పోలీసుల వివరాల ప్రకారం.. పోచారం ప్రాంతానికి చెందిన మనోహర్ అనే యువకుడికి ఒక యువతితో వివాహం నిశ్చయమైంది. కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి మాటలు కూడా జరిగాయి. అయితే కొద్ది రోజుల తర్వాత మనోహర్‌కు హెచ్‌ఐవీ ఉందని యువతి కుటుంబానికి తెలిసింది. దీంతో యువతి వెంటనే పెళ్లికి నిరాకరించింది. పెళ్లి రద్దు కావడంతో మనోహర్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. తనను అవమానించారని భావించి యువతిపై కక్ష పెంచుకున్నాడు. ఈ నెల 11వ తేదీన ఆమె ఇంటికి వెళ్లి మళ్లీ తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేశాడు.

raju-weds-rambai-movie-repeat-in-real-life-that-men-injected-hiv-blood-injection-to-young-women-at-h

హెచ్‌ఐవీ రక్తంతో ఇంజెక్షన్..

అప్పుడు కూడా యువతి స్పష్టంగా పెళ్లికి నిరాకరించడంతో మనోహర్ ఆగ్రహంతో ముందే తీసుకువచ్చిన సిరంజ్‌తో ఆమెకు బలవంతంగా ఇంజెక్షన్ ఇచ్చినట్లు సమాచారం. ఇంజెక్షన్ ఇచ్చిన వెంటనే అతడు అక్కడి నుంచి పారిపోయాడు. పోలీసుల ప్రాథమిక విచారణలో మనోహర్‌తో పాటు అతని తల్లిదండ్రులకు కూడా గతంలోనే హెచ్‌ఐవీ ఉన్నట్లు సమాచారం బయటపడింది. ఈ విషయం తెలిసిన తర్వాతే యువతి పెళ్లికి నిరాకరించినట్లు తెలుస్తోంది.

యువతి ఫిర్యాదు...

ఈ ఘటన తర్వాత బాధిత యువతి కుటుంబ సభ్యులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. కొద్ది గంటల్లోనే నిందితుడు మనోహర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇంజెక్షన్ ఘటన తర్వాత బాధిత యువతిని ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. హెచ్‌ఐవీ సోకిందా లేదా అన్నది నిర్ధారించేందుకు వైద్యులు ప్రత్యేక పరీక్షలు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆమె వైద్యుల పర్యవేక్షణలో ఉంది.

పెళ్లికి నిరాకరించిందనే కారణంతో యువతిపై ఇలా ప్రతీకారం తీర్చుకోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+