వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజ్యసభ: కెసిఆర్ చూపు ఎటు? సుజనకి బాబు 'కాపు' షాకిచ్చేనా?

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/విజయవాడ: మరో నాలుగైదు నెలల్లో రాజ్యసభ ఎన్నికలు ఎప్పుడైనా జరగవచ్చు. ఏపీ, తెలంగాణలలో కొన్ని సీట్లు ఖాళీ కానున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఎవరికి అవకాశం వస్తుంది, ఏపీలో ఎవరికి అవకాశం దక్కుతుందనే చర్చ రాజకీయ వర్గాల్లో అప్పుడే జోరుగా సాగుతోంది.

ఏపీ, తెలంగాణలతో పాటు త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తమిళనాడు, అసోం, కేరళ రాష్ట్రాల్లోను రాజ్యసభకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రాజ్యసభ ఎన్నికలు ఎప్పుడైనా జరగవచ్చు. పలువురు రాజ్యసభ సభ్యుల టర్మ్ ఏప్రిల్ 2వ తేదీ నుంచి ఆగస్టు 1 మధ్య పూర్తి కానుంది.

ఏదైనా రాజ్యసభ స్థానం ఖాళీ అయితే ఆరు నెలల్లోగా ఎన్నిక పూర్తి చేయాల్సి ఉంది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో రాజ్యసభ ఎన్నికలను ఒకేసారి ఈసీ పూర్తి చేయవచ్చు. అయితే, ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తుందా, లేక విడివిడిగా నిర్వహిస్తుందా తెలియాల్సి ఉంది.

పనికి.. ; ఈ రోజు కార్టూన్

ఈ నేపథ్యంలో, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి చాలా మంది రాజ్యసభ సీటును ఆశిస్తున్నారు. తెలంగాణ నుంచి కాంగ్రెస్ ఎంపీ వి హనుమంత రావు, టిడిపి నుంచి గెలిచి ఆ తర్వాత తెరాసలో చేరిన గుండు సుధారాణిల టర్మ్ జూన్ 21వ తేదీకి పూర్తి కానుంది.

ఇప్పటికే విపక్షాలకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులను తెరాస తన పార్టీలో చేర్చుకుంది. ఈ నేపథ్యంలో రెండు రాజ్యసభ సీట్లు తెరాస ఖాతాలోకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.

టిడిపి, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇంకొంతమంది ఎమ్మెల్యేలు కూడా కారు ఎక్కనున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రెండు సీట్లు టిఆర్ఎస్ ఖాతాలో పడనున్నాయని అంటున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇవి తొలి రాజ్యసభ ఎన్నికలు కానున్నాయి.

 గుండు సుధారాణి

గుండు సుధారాణి

గుండు సుధారాణి టిడిపిని వీడి కొద్ది రోజుల క్రితం టిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో రెండోసారి రాజ్యసభను ఆమెను పంపించేందుకు సీఎం కెసిఆర్ ఏమైనా హామీ ఇచ్చారా అనేది తెలియాల్సి ఉంది. దీంతో, రాజ్యసభ రేసులో ఆమె పేరు కూడా ఉన్నారు.

 కెసిఆర్, కెటిఆర్ వద్దకు ఆశావహులు

కెసిఆర్, కెటిఆర్ వద్దకు ఆశావహులు

ఇప్పటికే ఆశావహులు సీఎం కెసిఆర్, మంత్రి కెటి రామారావు వద్ద తమ ఉద్దేశ్యాన్ని చెబుతున్నారట. రేసులో మరికొంతమంది కూడా ఉన్నారు. నమస్తే తెలంగాణ పత్రిక యజమాని దామోదర్ రావు, కెసిఆర్‌కు సన్నిహితుడైన కెప్టెన్ లక్ష్మీ కాంతా రావు తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి.

 రేసులో డి శ్రీనివాస్, రాజాం

రేసులో డి శ్రీనివాస్, రాజాం

వారే కాకుండా మీడియా మ్యాన్ సిఎం రాజామ్, మాజీ మంత్రులు డి శ్రీనివాస్, ఎస్ వేణుగోపాల చారి, మాజీ ఎంపీ మంద జగన్నాథం తదితరులు ఆశావహుల జాబితాలో ఉన్నారు.

 జూన్ వరకు నిర్మల, జైరాం, సుజన, జెడిల టర్మ్

జూన్ వరకు నిర్మల, జైరాం, సుజన, జెడిల టర్మ్

ఏపీ విషయానికి వస్తే.. నిర్మలా సీతారామన్, సుజనా చౌదరి, జెడి శీలం, జైరామ్ రమేష్‌ల టర్మ్ జూన్ 21వ తేదీకి ముగుస్తుంది. ఈ నాలుగు స్థానాల్లో మూడు టిడిపి - బిజెపి కూటమికి, ఒకటి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి వెళ్లనుంది.

 సీఎం రమేష్

సీఎం రమేష్

టిడిపి ఎంపీ సీఎం రమేష్ మాత్రం నాలుగు రాజ్యసభ సీట్లు తామే గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరికొంతమంది వైసిపి ఎమ్మెల్యేలు తమ వైపు వస్తారని, తద్వారా తామే నాలుగో సీటును కూడా కైవసం చేసుకుంటామని చెబుతున్నారు.

 వైయస్ జగన్, విజయ సాయి రెడ్డి

వైయస్ జగన్, విజయ సాయి రెడ్డి

వైసిపి తరఫున 2014లో 67 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. అందులో ఐదుగురు టిడిపిలో చేరారు. జగన్‌తో కలిపి ఇంకా 62 మంది ఉన్నారు. 36 మంది కంటే తక్కువ ఎమ్మెల్యేలు ఉంటేనే వైసిపి నుంచి రాజ్యసభ చేజారే అవకాశముంది. కానీ అలాంటి పరిస్థితి రాదనే చెప్పవచ్చు. ఒకేసారి మరో ముప్పై మంది ఎమ్మెల్యేలు సైకిల్ ఎక్కే అవకాశాలు ఉండకపోవచ్చు. విజయసాయి రెడ్డికి జగన్ అవకాశమిస్తారని అంటున్నారు.

 వెంకయ్య నాయుడు

వెంకయ్య నాయుడు

ఏపీలో నాలుగు రాజ్యసభ సీట్లలో మూడు టిడిపి - బిజెపి కూటమికి వస్తాయి. చంద్రబాబు ఎవరికి అవకాశమిస్తారనే అంశం చర్చనీయాంశమవుతోంది. వెంకయ్య నాయుడు టర్మ్ జూన్ 30వ తేదీ వరకు ఉంది. ఈ నేపథ్యంలో ఆయనకు ఏపీ నుంచి అవకాశం ఇచ్చే అవకాశాలున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి.

నిర్మలా సీతారామన్

నిర్మలా సీతారామన్

నిర్మలా సీతారామన్ టర్మ్ త్వరలో ముగుస్తోంది. అయితే ఆమెను మరోసారి బిజెపి అవకాశం ఇస్తుందా లేదా అనేది ఇంకా తెలియదు. ఆమెకు మాత్రం బిజెపి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి సంకేతాలు అందలేదని తెలుస్తోంది.

 సుజనా చౌదరి

సుజనా చౌదరి

సుజనా చౌదరి టర్మ్ కూడా పూర్తి కానుంది. ఆయనకు చంద్రబాబు మరోసారి అవకాశమిస్తారా లేదా అనేది కూడా టిడిపిలో చర్చనీయంగా మారింది. సామాజిక వర్గాలు, పార్టీ నాయకులు, సీనియర్లు, గతంలో అవకాశం లానివారు... ఇలా ఎన్నింటినో చంద్రబాబు బేరీజు వేసుకోవాల్సి ఉంది. మరోవైపు, ఇటీవల కాపు ఉద్యమం రగడ రాజేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబు కమ్మ లేదా కాపు లేదా బీసీ లేదా మైనార్టీలకు అవకాశమివ్వాలనుకుంటే సుజనను పక్కన పెట్టక తప్పదనే వాదనలు వినిపిస్తున్నాయి.

English summary
Assuming that the entire Opposition — TD, Congress and BJP, along with CPI and CPM members — fields a common candidate, even then the TRS, with its present strength in the House, will make it.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X