వర్మ సంచలనం: థాకరే, కేసీఆర్, లాలూ ఒకే వ్యక్తిగా మారితే 'అతను'

హైదరాబాద్: ఎప్పుడూ తన వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో ఉండే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా అమెరికా అధ్యక్ష బరిలో ఉన్న డోనాల్డ్ ట్రంప్‌ను కూడా వదల్లేదు. రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష అధ్యక్ష బరిలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ తీరుపై వర్మ తనదైన శైలిలో స్పందించారు.

అమెరికా చరిత్రలోనే ఇంత కలర్‌ఫుల్ అధ్యక్ష అభ్యర్థి, బహిరంగంగా మాట్లాడే వ్యక్తి మరొకరు ఉన్నారని తాను అనుకోవడం లేదన్నారు. బాల్ థాకరే, కేసీఆర్, లాలూ ప్రసాద్ యాదవ్‌లు ముగ్గురు ఒకే వ్యక్తిగా మారితే.. అతనే డొనాల్డ్ ట్రంప్ అని, డొనాల్డ్ అమెరికా అధ్యక్షుడు కావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానంటూ వర్మ ట్విట్టర్‌లో తన సందేశాన్ని పోస్టు చేశారు.

Ram gopal varma compares donald trump to kcr, lalu and thackeray

అంతేకాదు నవ్యాంధ్ర తాత్కాలిక రాజధానిగా ఉన్న విజయవాడపై కూడా స్పందించారు. విజయవాడ రౌడీల వల్లే ఇంత ఫేమస్ అయ్యింది తప్ప ఎప్పటి నుంచో ఉన్న కనకదుర్గ ఆలయం వల్ల కాదని వర్మ ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. శ్రీశైలం, తిరుపతి వంటి ప్రాంతాల్లో రౌడీలు లేరు కాబట్టి విజయవాడలా ఫేమ్ కాలేదని, దీన్ని బట్టి దేవుళ్ల కంటే రౌడీలే ఎక్కువ ఫేమస్ అని మరొక ట్వీట్‌లో పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+