Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

'నయీంలకే నయీంను, మరదలి పట్ల దారుణంగా': బెదిరింపు కాల్స్‌పై వర్మ

హైదరాబాద్: తెలంగాణ పోలీసుల చేతుల్లో హతమైన గ్యాంగ్ స్టర్ నయీం జీవితం ఆధారంగా సినిమా తీస్తున్నట్లు సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇటీవలే సోషల్‌మీడియా ద్వారా వెల్లడించిన సంగతి తెలిసిందే. సినిమాకు సంబంధించిన ఓ పాటను కూడా ఆయన విడుదల చేశాడు.

అప్పటి నుంచి వర్మకి నయీం అనుచరుల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ట్విట్ట‌ర్‌లో పోస్టు చేశారు. తాను నయీంలకే నయీం అన్న వ‌ర్మ ఈ విష‌యాన్ని త‌న‌ను బెదిరిస్తున్న వారు తెలుసుకోవాలని సూచించాడు. తాను తీయ‌బోమే సినిమా కోసం ముంబై జైలులో ఉన్న నయీం సన్నిహితుడిని, నయీంకు సాయం చేసిన ఐదుగురు పోలీసులను క‌లిసిశానన్నాడు.

Ram Gopal Varma Responds On Theaten Calls from Nayeem Followers

అంతేకాదు తాను నయీంతో మూడేళ్లు కలిసి పనిచేసిన ఇద్దరు నక్సలైట్లను కూడా కలిసిన‌ట్లు చెప్పాడు. నయీం గురించి అన్ని వివరాలు తెలుసుకున్నానని, న‌యీంకి కరాచీకి చెందిన ఓ వ్యక్తితో సంబంధాలు ఉన్నాయని తెలిసి షాకుకు గురైనట్లు పేర్కొన్నాడు. నయీం తన మరదలి పట్ల ఎంత ఘోరంగా ప్రవర్తించాడో కూడా తెలుసుకున్నట్లు వ‌ర్మ ట్విట్టర్‌లో పేర్కొన్నాడు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+