డేరాబాబా:నల్గొండ జిల్లాతో అనుబంధం, 56 ఎకరాల్లో ఆశ్రమం
నల్గొండ:అత్యాచార కేసులో అరెస్టైన వివాదాస్పద రామ్‌రహీమ్‌బాబాకు నల్గొండ జిల్లాతో కూడ అనుబంధం ఉంది. నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడులో డేరా స్వచ్ఛ సౌదా చీఫ్ రామ్‌రహీమ్‌సింగ్‌కు నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడులో ఓ ఆశ్రమం ఉంది.

వెలిమినేడు గ్రామంలో 56 ఎకరాల్లో ఈ ఆశ్రమం ఉంది. రాక్‌స్టార్‌గా పేరొందిన రాంరహీం సింగ్‌కు మండలంలోని వెలిమినేడులో జాతీయ రహదారికి ఆనుకొని ఆశ్రమం ఉంది. కాగా... ఈ ఆశ్రమంలో కూడా పలు అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి.
ఈ 56 ఎకరాల్లో ఆరు ఎకరాలు అసైన్డ్ భూములు ఉన్నట్లు రెవెన్యూ అధికారులు కూడా అప్పట్లో నిర్ధారించారు. కాగా... ఈ భూమి క్రమబద్ధీకరణ కోసం ఆశ్రమ నిర్వహకులు రెవెన్యూ అధికారులకు దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తుంది.












Click it and Unblock the Notifications