Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రాంచరణ్ సతీమణి ఉపాసన ఫ్యామిలీలో విషాదం.. భావోద్వేగ ట్వీట్...

మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ రామ్ చ‌ర‌ణ్ స‌తీమ‌ణి ఉపాస‌న ఫ్యామిలీలో విషాదం చోటు చేసుకుంది. ఉపాస‌న తాత‌య్య కామినేని ఉమాప‌తి రావు(92) మంగ‌ళ‌వారం రాత్రి హైద‌రాబాద్‌లోని అపోలో ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ క‌న్నుమూశారు. వ‌యసు పైబడటం,కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుండటంతో ఆయన కన్నుమూసినట్టు సమాచారం.

ఉమాపతి రావు మరణంపై ఉపాసన ట్విట్టర్‌లో సంతాపం ప్రకటించారు. 'మా తాత కె.ఉమాపతి రావు-ఐఏఎస్ (జూన్‌ 15,1928- మే 27, 2020) గొప్ప విలువలు, నిస్వార్థం, మానవతామూర్తి గల వ్యక్తి. ఆయనకు హాస్య చతురత కూడా ఎక్కువే. ఉర్దూలోనూ షాయరీలు రాశారు. టీటీడీ తొలి ఈవోగా పనిచేశారు. అనేక గొప్ప సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మీ ఆత్మకు శాంతి చేకూరాలి తాత' అంటూ భావోద్వేగంగా స్పందించారు.

ramacharans wife upasana grand father umapathy rao passes away

Recommended Video

    Upasana Konidela Grandfather Kamineni Umapathy Rao Is No More

    తెలంగాణ‌లోని దోమ‌కొండ‌లో జ‌న్మించిన ఉమాప‌తి రావు ఐఏఎస్ ఆఫీస‌ర్‌గా పని చేశారు. ఆయ‌న మృతిపై పలువురు నెటిజెన్స్ సంతాపం తెలిపారు. స‌న్నిహితులు, మెగా అభిమానులు ఉమాప‌తి ఆత్మ‌కి శాంతి క‌లగాల‌ని ప్రార్ధిస్తున్నారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+