ఆదిలాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇచ్చిన హామీపై వెనక్కి, కేసీఆర్‌కు మరో భారీ షాక్: రమేష్ రాథోడ్ రాజీనామా

|
Google Oneindia TeluguNews

Recommended Video

తెరాసకు రమేష్ రాథోడ్ రాజీనామా

అదిలాబాద్: ఉమ్మడి అదిలాబాద్ జిల్లా కీలక నేత తెరాసకు గుడ్ బై చెప్పారు. తెలుగుదేశం పార్టీలో కీలక నేతగా ఉన్న ఆయన ఆ తర్వాత తెరాసలో చేరారు. ఆయన ఖానాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం టిక్కెట్ పైన ఆశలు పెట్టుకున్నారు. ఇప్పుడు అది నెరవేరకపోవడంతో పార్టీ అధినేత కేసీఆర్‌కు షాకిస్తూ తెరాసకు రాజీనామా చేశారు.

కాంగ్రెస్‌లో చేరికకు రంగం సిద్ధం

కాంగ్రెస్‌లో చేరికకు రంగం సిద్ధం

ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. కేసీఆర్ ఈ నెల ఆరో తేదీన 105 మంది అభ్యర్థులను ఒకేసారి ప్రకటించారు. ఇందులో భాగంగా ఖానాపూర్ టిక్కెట్‌ను రేఖా నాయక్‌కు కేటాయించారు. అప్పటి నుంచి రమేష్ రాథోడ్ మనస్తాపంతో ఉన్నారు. టిక్కెట్ కోసం ప్రయత్నాలు చేసి, విఫలమై, ఇప్పుడు రిజైన్ చేశారు.

కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డికి కీలక పదవి: 9 కమిటీలు, చైర్మన్లు వీరేకాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డికి కీలక పదవి: 9 కమిటీలు, చైర్మన్లు వీరే

ఖానాపూర్ టిక్కెట్ హామీపై తెరాసలో చేరిక

ఖానాపూర్ టిక్కెట్ హామీపై తెరాసలో చేరిక

టీడీపీ పోలిట్ బ్యూరోలో కొనసాగుతున్న సమయంలో రమేష్‌ రాథోడ్ గత ఏడాది తుమ్మల నాగేశ్వర రావు సమక్షంలో తెరాస తీర్థం పుచ్చుకున్నారు. ఖానాపూర్ ఎమ్మెల్యే టిక్కెట్ ఒప్పందంపై ఆయన పార్టీలో చేరారు. కానీ ఇప్పుడు పార్టీ అధిష్టానం టిక్కెట్ నిరాకరించడంతో ఆయన అసంతృప్తికి లోనయ్యారు.

తెరాసలో టిక్కెట్ ప్రయత్నాలు ఫలించలేదు

తెరాసలో టిక్కెట్ ప్రయత్నాలు ఫలించలేదు

తనకు టిక్కెట్ ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ ఈ నెల 8వ తేదీన ఉట్నూర్‌ కేంద్రంగా భారీ ర్యాలీని రమేష్ రాథోడ్ చేపట్టారు. టిక్కెట్‌ రాకపోయినా ఖానాపూర్‌ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగానైనా పోటీ చేస్తానని స్పష్టం చేశారు. ఇటు తెరాసతో, అటు కాంగ్రెస్‌తో చర్చలు జరిపారు. తెరాసలో టిక్కెట్ ప్రయత్నాలు ఫలించలేదు.

కాంగ్రెస్ హామీ, రేపు చేరిక

కాంగ్రెస్ హామీ, రేపు చేరిక

కాంగ్రెస్ టిక్కెట్ పైన రమేష్ రాథోడ్‌కు హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. దీంతో అతను గాంధీ భవన్‌ వేదికగా కాంగ్రెస్ పార్టీలో శుక్రవారం చేరాలని నిర్ణయించుకున్నారు. ఖానాపూర్‌ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ పార్టీ తరపున పోటీ చేస్తానని తెలిపారు.

English summary
Former MP Ramesh Rathod resigned from TRS party on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X