రోడ్డుప్రమాదంలో రమేశ్ రాథోడ్‌కు గాయాలు
ఆదిలాబాద్ : మాజీ ఎంపీ, ఆదిలాబాద్ లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థి రమేశ్ రాథోడ్ ప్రమాదానికి గురయ్యారు. ఆదిలాబాద్‌లో రమేశ్ ప్రయాణిస్తోన్న వాహనం చెట్టును ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. దీంతో ఆయన తల, ఛాతీ కింది భాగంలో గాయాలయ్యాయి. చికిత్స కోసం రిమ్స్‌కు తరలించారు.

పందిని తప్పించబోయి ..
ఎన్నికల ప్రచారం ముగించుకొని ఆదిలాబాద్ నుంచి ఉట్నూరు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మావల క్రాస్ రోడ్డు వద్ద రమేశ్ .. ఇన్నోవా వాహనానికి ఓ పంది అడ్డు వచ్చింది. దాన్ని తప్పించే క్రమంలోనే ప్రమాదం జరిగింది. రమేశ్ రాథోడ్ సెక్యూరిటీ సిబ్బంది ఆయనను ప్రైవేట్ వాహనంలో ఆస్పత్రికి తరలించారు ఆయనకు వైద్యులు పరీక్షలు చేశారు. స్కానింగ్ తర్వాత ప్రమాదమేమి లేదని చెప్పారు. ప్రస్తుతం రమేశ్ పరిస్థితి నిలకడగా ఉందని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications