అమెరికన్లూ ‘క్లంప్’నే ఎన్నుకోండి’: వర్మ అనిపించుకున్నారు!
హైదరాబాద్: వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో ఉండే ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ మరో ఈసారి అమెరికా అధ్యక్ష ఎన్నికలపై దృష్టి సారించినట్లున్నారు. ఇప్పటికే అమెరికన్లు ఎన్నికల నేపథ్యంలో ఎవరికి ఓటేయాలో తేల్చుకోలేక ఒత్తిడికి గురవుతున్నారంటూ వార్తలు వస్తుంటే.. వర్మ తనదైన శైలిలో స్పందించారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్ధి డోనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ అధ్యక్ష అభ్యర్ధి హిల్లరీ క్లింటన్ పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసుకుంటూ కొన్ని వర్గాల మద్దతు పోగొట్టుకుంటూ ట్రంప్ వెనకబడి పోతుంటే.. హిల్లరీ మాత్రం అన్ని వర్గాలను ఆకర్షించుకుంటూ ముందుకు సాగిపోతున్నారు.
గందరగోళంలో ఉన్న అమెరికన్లు ట్రంప్, హిల్లరీలకు ఓటేయొద్దు.. 'క్లంప్'కి ఓటెయ్యండి అంటూ ట్విట్టర్ వేదికగా రాంగోపాల్ వర్మ కొత్త వాదానికి తెరతీశారు. అంతేగాక, క్లంప్ ఫొటో కూడా పెట్టారు.

ఇందులో సగం ట్రంప్ తల, సగం హిల్లరీ క్లింటన్ తల కలిపి ఉన్నాయి. ఈ ఫొటోనే ట్రంప్ గా పేర్కొన్న వర్మా.. ఈ మూడో వ్యక్తినే ఎన్నుకోండంటూ అమెరికన్లకు పిలుపునిచ్చాడు.
'ఎవరికి ఓటెయ్యాలా అని కన్‌ఫ్యూజ్ అవుతున్న అమెరికన్ల కోసం ట్విట్టరూన్ మరో అభ్యర్ధిని రూపొందించింది. అతనే క్లంప్ లేదా ఆమే ట్రిల్లరీ. అంటే క్లింటన్, ట్రంప్ అన్నమాట'' అంటూ ట్వీట్ చేశారు వర్మ.
Hey @realDonaldTrump @HillaryClinton Is this Trillary or Clump? pic.twitter.com/EbWxxL93Yn
— Ram Gopal Varma (@RGVzoomin) 19 October 2016
All news of Sarkar 3 from now onwards will be on this link ...My vision for Sarkar 3 https://t.co/1JFl7FwrD1
— Ram Gopal Varma (@RGVzoomin) 18 October 2016












Click it and Unblock the Notifications