పవన్ కాళ్లు పిసికి రుణం తీర్చుకుంటా... గురూజీకి నా సేవలందిస్తా... పవన్‌పై శ్రీరెడ్డి హాట్ కామెంట్స్...
ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి వరుస ట్వీట్లతో పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేశారు. కోవిడ్ సోకి హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్న పవన్ కల్యాణ్ ఫోటో బయటకు రావడంతో... దానిపై తనదైన శైలిలో సెటైర్లు వేశారు. పలు సందేహాలు కూడా లేవనెత్తారు. ఓవైపు ఆర్జీవీ వరుస ట్వీట్లు హాట్ టాపిక్‌గా మారగా... ఇంతలోనే నటి శ్రీరెడ్డి కూడా ఈ విషయంలోకి దూరింది. ఆమె కూడా పవన్ టార్గెట్‌గా తన ఫేస్‌బుక్‌లో పలు కామెంట్స్ చేసింది.
Recommended Video
పవన్ అందుకే మంచాన పడ్డాడు : ఆర్జీవీ
'ఒక కనిపించని నీచమైన పురుగు కూడా పవన్ కల్యాణ్‌ను ఇలాంటి దయనీయ స్థితిలో పడుకోబెట్టేసిందంటే అసలు హీరో అనే వస్తువు ఈ ప్రపంచంలో ఉన్నట్టా లేనట్టా? చెప్పండి యువర్ ఆనర్' అంటూ పవన్‌పై ఆర్జీవీ తన ట్వీట్లను మొదలుపెట్టారు. మరో ట్వీట్‌లో... 'హే పీకే ఫ్యాన్స్,వేరే హీరోల దగుల్బాజీ ఫ్యాన్స్.. పవన్ కల్యాణ్ ఇలా మంచాన పడటానికి కోవిడ్ కారణం కాదు. వకీల్ సాబ్ కలెక్షన్లు అంటున్నారు. రండి,కదలండి,ప్రాణాలకు తెగించి పీకే జేబులు నింపండి...' అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
ఆ ఫోటోలో ఏదో తేడా కొడుతోంది : ఆర్జీవీ
ఆర్జీవీ ట్వీట్లు అక్కడితో ఆగలేదు. పవన్ కల్యాణ్ బెడ్‌పై పడుకుని ఉన్న ఫోటోను ట్వీట్ చేసి... ఇందులో ఏదో తేడా కొడుతుంది అని కామెంట్ చేశారు. అంతేకాదు,ఇందులో తేడా ఏంటో మీ ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్‌ను అడగ్గలరా అంటూ రాజమౌళిని కూడా లాగారు. ఆ తర్వాత మరో ట్వీట్‌లో 'ఈ ఫోటోలో ఫేక్ ఏంటో చెప్పండి... గెలిచినవారి ఫోటో అప్‌లోడ్ చేసి రివార్డు కూడా ఇస్తాను..' అని పేర్కొన్నారు. ఆ తర్వాత వెంటనే... 'ఫేక్ అని నేనట్లేదు,వేరే హీరోల దగుల్బాజీ ఫ్యాన్స్ అంటున్నారు... వాళ్ల ఆట కట్టించడానికే పీకే ఫ్యాన్‌గా సవాల్ విసిరాను' అంటూ మరో ట్వీట్‌తో ముగించారు.

రంగంలోకి శ్రీరెడ్డి కూడా...
పవన్ ఫోటోపై ఆర్జీవీ అలా ట్వీట్స్ చేశాడో లేదో... ఆ తర్వాత గంటకే శ్రీరెడ్డి కూడా రంగంలోకి దిగింది. పవన్ బెడ్ పక్కన తాను కూర్చొన్నట్లుగా ఒక ఫోటోను తన ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేసింది. 'పీకే పట్ల శ్రద్ద తీసుకునేందుకు ఆర్జీవీ సార్ నన్ను ఇక్కడ అపాయింట్ చేశారు. గురూజీకి నేను నా సేవలందిస్తాను. కాళ్లు పిసికి రుణం తీర్చుకుంటా. ముక్కు మాత్రం పిసకను గురూజీ.. ఊపిరి ఆడట్లేదంటా ఇప్పటికే... సదా మీ ఇద్దరి సేవలో..' అంటూ ఆ ఫోటోకి తన కామెంట్‌ను జతచేసింది.












Click it and Unblock the Notifications