రంగనాథ్ వంటగదిలో ఉరేసుకున్నారా?: ఇంట్లో పోలీసు సోదాలు
హైదరాబాద్: ప్రముఖ సినీ నటుడు రంగనాథ్ ఉరేసుకుని మరణించారనే ప్రచారం సాగుతోంది. ఆయన హైదరాబాదులో కవాడీగుడాలో గల ఇంటిలోని వంటగదిలో ఉరేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. ఆయన మృతిపై బంధువులు అనుమానాలు వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.
నిజానికి రంగనాథ్ ఉంటున్నది తన పెద్ద కూతురు నివాసమని తెలుస్తోంది. ఆయన ఒంటరిగానే ఆ ఇంట్లో ఉంటున్నారు. ఆయన సంతానం బెంగళూరులో ఉద్యోగాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన మృతికి సంబంధించిన సమాచారాన్ని వారికి చేరవేసినట్లు తెలుస్తోంది.

ఆయన భౌతిక కాయాన్ని గాంధీనగర్‌లోని నర్మదా ఆస్పత్రిలో ఉంచారు. బంధువులు అనుమానాలు వ్యక్తం చేయడంతో పోలీసులు ఆయన నివాసంలో సోదాలు చేస్తున్నారు. రంగనాథ్ గత కొంతకాలంగా ఎక్కువగా ఎవరితోనూ మాట్లాడడం లేదని కూడా చెబుతున్నారు.
రంగనాథ్ మృతితో తెలుగు సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. 300లకు పైగా చిత్రాల్లో నటించిన రంగనాథ్ సౌమ్యుడిగా పేరు సంపాదించుకున్నారు. ఇటీవల ఆయన ఓ కవిత్వం పుస్తకాన్ని కూడా వెలువరించారు. రంగనాథ్ పూర్తి పేరు తిరుమల సుందర శ్రీరంగనాథ్.
మొగుడ్స్ పెళ్లామ్స్ అనే చిత్రానికి దర్శకత్వం కూడా వహించారు. రంగనాథ్ మృతికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంతాపం ప్రకటించారు.
-
పిల్ల బచ్చా గాళ్ల సినిమాకు.. అద్దిరిపోయే కలెక్షన్స్.. -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!! -
ఇండస్ట్రీలో ఉండాలంటే కమిట్మెంట్ కు ఒప్పుకోవాల్సిందే: నటి సంచలన కామెంట్స్ వైరల్ -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
టాలీవుడ్ vs పొలిటీషియన్స్: డ్రగ్స్ టెస్ట్ రచ్చ! -
తెలుగు హీరోయిన్ వీడియో వైరల్ !! -
అర్ధరాత్రి 2 గంటలకు ఆ హీరోయిన్ తో తట్టుకోలేక పారిపోయా.. సమంత షాకింగ్ కామెంట్స్ -
ఓటీటీని వణికిస్తున్న థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ఒంటరిగా ఉండే వారే టార్గెట్ !! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్, మెగాస్టార్, లేడీ సూపర్ స్టార్.. మరో భారీ ప్రాజెక్ట్! -
మహేష్‌బాబుకు బాగా ఇష్టమైన అల్లు అర్జున్ సినిమా












Click it and Unblock the Notifications