Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తుపాకీ పెట్టి వివాహితపై రేప్: మాజీ సీఐ నాగేశ్వరరావు కేసు రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు

హైదరాబాద్: వివాహితపై తుపాకీ గురిపెట్టి అత్యాచారానికి పాల్పడిన మాజీ సీఐ కే నాగేశ్వరరావు కేసు రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగుచూశాయి. అత్యాచారం, కిడ్నాప్, హత్యాయత్నం, ఆయుధ నిరోధక చట్టం కింద ఆయనపై వనస్థలిపురం పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించి ఆమె వాంగ్మూలం రికార్డు చేశారు. కేసు దర్యాప్తులో అధికారులు కీలక ఆధారాలు సేకరించారు.

అత్యాచారం కేసులో ఆధారాలు సేకరించిన క్లూస్ టీం

అత్యాచారం కేసులో ఆధారాలు సేకరించిన క్లూస్ టీం

బాధితురాలిపై అత్యాచారం జరిగిన గదిలో వెంట్రుకలు, దుప్పటి, గాజులు క్లూస్ టీం స్వాధీనం చేసుకుంది. నాగేశ్వరరావును బాధితురాలి భర్త కొట్టిన కర్ర, అత్యాచార సమయంలో బాధితురాలి దుస్తులు స్వాధీనం చేసుకుని వాటిని ఎఫ్ఎస్ఎల్ కి పంపించినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలు, ఆమె భర్తను కారులో తీసుకెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగిన ప్రమాదాన్ని కేసు దర్యాప్తు చేస్తున్న వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తంరెడ్డి పరిశీలించారు.

అత్యాచారం చేసి, బాధితురాలిని, ఆమె భర్తను బలవంతంగా..

అత్యాచారం చేసి, బాధితురాలిని, ఆమె భర్తను బలవంతంగా..

కాగా, కేసు దర్యాప్తులో భాగంగా బాధితురాలి ఇంటి వద్ద ఓ ఎలక్ట్రిక్ దుకాణం సీసీ ఫుటేజీ సేకరించామని పోలీసులు వెల్లడించారు. ఇబ్రహీంపట్నం వెళ్లే దారిలో సీసీ కెమెరాల్లో నాగేశ్వరరావు కారు గుర్తించినట్లు తెలిపారు. కారు వనస్థలిపురం నుంచి ఇబ్రహీంపట్నంవైపు వెళ్తుండగా ప్రమాదం జరిగిందని తెలిపారు. ప్రమాదానికి గురైన కారును స్వాధీనం చేసుకున్నామని, బాధితురాలి సెల్‌ఫోన్ సీజ్ చేసినట్లు తెలిపారు. ఘటన జరిగిన తర్వాత బాధితురాలిని, ఆమె భర్తను బలవంతంగా కారులో ఎక్కించుకుని వెళ్తుండగా ప్రమాదానికి గురైంది.

నేరం బయటపడకుండా నాగేశ్వరరావు వేసిన పాచికపారలేదు

నేరం బయటపడకుండా నాగేశ్వరరావు వేసిన పాచికపారలేదు

అయితే, ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులకు.. తాను ఆక్టోపస్ అధికారినని, కానిస్టేబుల్‌తో కలిసి వెళ్తుండగా కారు ప్రమాదం జరిగిందని నాగేశ్వరరావు తప్పుడు సమాచారం ఇచ్చాడు. కారు ప్రమాదంపై అతని వద్ద పనిచేసే హోంగార్డుకు సమాచారం ఇవ్వడంతో అతను ట్రోయింగ్ వాహనం ద్వారా కారును చంపాపేట్‌కు తరలించాడు. హోంగార్డు ప్రవీణ్ స్టేట్‌మెంట్‌ను కూడా పోలీసులు రికార్డు చేశారు.


అత్యాచారం ఘటన తర్వాత నాగేశ్వరరావు తన బట్టలు స్వయంగా ఉతుక్కున్నాడని, ఏమీ తెలియనట్లుగా మారేడ్‌పల్లి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించినట్లు పోలీసులు దర్యాప్తులో తేలింది. కాగా, బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలుసుకుని మారేడ్‌పల్లి పీఎస్‌లోనే రివాల్వర్ ఉంచి బెంగళూరుకు పరారయ్యాడు నాగేశ్వరరావు. ఈ క్రమంలో కొత్తపేటలోని గ్రీన్ హిల్స్ కాలనీలో నాగేశ్వరావు నివాసంలో సోదాలు నిర్వహించిన పోలీసులు.. అత్యాచార సమయంలో వాడిన ప్యాంట్, షర్ట్, లోదుస్తులు స్వాధీనం చేసుకున్నారు. జులై 10న నాగేశ్వరరావును అదుపులోకి తీసుకున్న పోలీసులు అరెస్ట్ చేసి వనస్థలిపురం ఏరియా ఆస్పత్రిలో వైద్యపరీక్షలు, కరోనా, లైంగిక పటుత్వ పరీక్షలు నిర్వహించిన అనంతరం హయత్ నగర్ కోర్టులో హాజరుపర్చారు. కోర్టు రిమాండ్ విధించడంతో చర్లపల్లి జైలుకు తరలించారు.

జులైన 6న నాగేశ్వరరావు ఏం చేశారంటే.?

జులైన 6న నాగేశ్వరరావు ఏం చేశారంటే.?

జులై 6న తుపాకీతో బెదిరింపులకు గురిచేసి వివాహితపై అత్యాచారం చేశాడు నాగేశ్వరావు. ఆ తర్వాత బాధితురాలితోపాటు ఆమె భర్తను బలవంతంగా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పరిధిలోని ఎల్మినేడుకు కారు(నెంబర్. TS 08 EA 0633)లో తీసుకెళ్తుండగా కారు ప్రమాదానికి గురైంది. కారు నడుపుతున్న నాగేశ్వరరావు భుజానికి గాయం కావడంతో బాధిత దంపతులిద్దరూ తప్పించుకున్నారు. బాధిత దంపతులు వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నాగేశ్వరరావు దురాగతం వెలుగుచూసింది. హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ సీఐ నాగేశ్వరరావును సస్పెండ్ చేశారు. మొదట పరారీలో ఉన్న నాగేశ్వరరావు.. బాధిత దంపతులతో రాజీ కుదుర్చుకునేందుకు ప్రయత్నించాడు. అయితే, కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసు ఉన్నతాధికారులు నాగేశ్వరరావును అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో నాగేశ్వరరావు తన నేరాన్ని అంగీకరించారు. కాగా, జులై 6న అత్యాచారం ఘటన జరిగిన ఇంట్లో నుంచి అరుపులు, కేకలు వినిపించాయని స్థానికులు తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+