అత్యాచారయత్నం విఫలమైంది కాని , ఆత్మహాత్యయత్నం సక్సెస్
హైదరాబాద్ :అత్యాచారయత్నం ఫెయిలైంది. కాని, ఆత్మహాత్యయత్నం మాత్రం సక్సెస్ అయింది. విషాద ఘటన హైద్రాబాద్ లోన బోడుప్పల్ లో చోటుచేసుకొంది.కన్న కూతురిగా చూడాల్సిన కోడలిపై మామ అత్యాచారయత్నానికి ప్రయత్నించి చివరకు ఆత్మహాత్య చేసుకొన్నాడు.
హైద్రాబాద్ బోడుప్పల్ లోని ఇందిరానగర్ కు చెందిన బద్దుల కృష్ణ కు 60 ఏళ్ళు. .తన కొడుకు కోడలితో కలిసి ఉంటున్నాడు. అయితే కొడలిపై కృష్ణ కన్నేశాడు. అవకాశం కోసం ఎదురుచూస్తున్నాడు.

శనివారం నాడు ఇంట్లో ఒంటరిగా ఉన్న కోడలిపై కృస్ణ అత్యాచారయత్నానికి ప్రయత్నించాడు. మామ నుండి తప్పించుకొన్న భాదితురాలు ఇంట్లో నుండి బయటకు వచ్చిన ఇరుగుపొరుగు వారికి విషయం చెప్పింది.
ఇరుగు పొరుగు వారికి తన విషయం తెలియడంతో భయానికి గురైన కృష్ణ గదిలోకి వెళ్ళి యాసిడ్ తాగాడు. చనిపోతానో లేదోనని భావించి కత్తితో గొంతు కోసుకొన్నాడు. తలుపులు బద్దలు కొట్టి చూసిన స్థానికులకు రక్తం మడుగులో ఉన్న కృష్ణ కన్పించాడు.గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం నాడు ఆయన మరణించాడు.












Click it and Unblock the Notifications