కాబోయే భార్యే కదా అని, అత్యాచారయత్నం, చివరికిలా....

Posted By:
Subscribe to Oneindia Telugu

కాజీపేట: వివాహం చేసుకోవాలని రెండు కుటుంబాల పెద్దలు నిర్ణయించారు.ఎంగేజ్ మెంట్ కు రెండు రోజుల ముందే వివాహం చేసుకొనే యువతిపై అత్యాచారానికి ప్రయత్నించాడు కాబోయే పెళ్ళికొడుకు. ఈ ఘటనపై బాధితురాలి కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించారు.

కాజీపేట జిల్లా చింతల్ బస్తీకి చెందిన ఓ యువతికి గత నెల 22వ, తేదిన హసన్ పర్తి మండలం వంగపహడ్ గ్రామానికి చెందిన పొన్నాల ప్రభుదాస్ అనే యువకుడికి నిశ్చితార్థం చేయాలని నిర్ణయించారు.

rape attempt

ఈ మేరకు రెండు కుటుంబాల మద్య అంగీకారం కుదిరింది. కట్నకానుకాల విషయాన్ని కూడ మాట్లాడుకొన్నారు.ఎంగేజ్ మెంట్ రోజునే వివాహముహుర్తం కూడ నిర్ణయం తీసుకొన్నారు.

అయితే ఎలాగు వివాహం చేసుకొనే అమ్మాయే కదా అని భావించిన ప్రభుదాస్ నిశ్చితార్థ సమయానికి రెండు రోజుల ముందే (గత నెల 20వ, తేదిన) చింతల్ బస్తీకి వచ్చాడు.తనకు కాబోయే భార్య ఒక్కతే ఇంట్లో ఉంది.

అయితే ఈ సమయాన్ని ఆసరాగా చేసుకొన్న ప్రభుదాస్ ఆమెపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు.దీంతో బాధితురాలు కేకలు వేసింది.ప్రభుదాస్ పారిపోయాడు.

అయితే తన కుటుంబసభ్యులకు బాధితురాలు విషయాన్ని చెప్పింది.అయితే యువతి తల్లిదండ్రులు పెద్దమనుషుల దృష్టికి తీసుకెళ్ళారు. అయితే ఈ విషయాన్ని మనసులో పెట్టుకొన్న ప్రభుదాస్ కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

అదనపు కట్నం ఇస్తేనే బాధితురాలిని వివాహం చేసుకొంటామని ప్రభుదాస్ కుటుంబసభ్యులు డిమాండ్ చేశారు.దీంతో సోమవారం నాడు బాధితురాలి కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు కాజీపేట సిఐ రమేష్ కుమార్ చెప్పారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
rape attempt on lady in warangal district. prabhudas rape attempt on a lady in chintal basti,victim family members compliant against in policestation.
Please Wait while comments are loading...