హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కన్నకుూతురిని రేప్ చేసిన తండ్రి జైలు: బాలికపై యువకుడి రేప్

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కామంతో కళ్లు మూసుకుపోయి కన్న కూతురిపై అత్యాచారం చేసిన వ్యక్తికి జైలు శిక్ష విధిస్తూ హైదరాబాదులోని నాంపల్లి అడిషనల్‌ మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ జడ్జి(ఏఎంఎస్‌జే)కళ్యాణ్‌చక్రవర్తి శుక్రవారం తీర్పు చెప్పారు. ఫలక్‌నూమకు చెందిన ఓ వ్యక్తి 2012లో కన్న కూతురిపై లైంగిక దాడి చేశాడు.

బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు దర్యాప్తు చేసి కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేశారు. వాదోపవాదాలు విన్న న్యాయమూర్తి నిందితుడికి శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చారు. సాక్ష్యంగా దర్యాప్తు అధికారులు డిఎన్ఎ పరీక్షల ఫలితాలను సమర్పించారు.

ఒమర్ ఖాన్ 2005లో నెలల పాటు 15 ఏళ్ల కూతురిపై అత్యాచారం చేశాడు. కొన్ని నెలల పాటు అత్యాచారం చేయడంతో బాలిక గర్భం కూడా దాల్చింది. బాధితురాలి తల్లి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు సాగించారు.

Rapist dad gets 7 years of rigorous imprisonment

బాలికపై యువకుడి అత్యాచారం

ఇదిలావుటే, బాలికపై అత్యాచారం చేసిన యువకుడిని హైదరాబాదులోని చాదర్‌ఘాట్‌ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. బాలిక(13) తల్లిదండ్రులు కొబ్బరి బొండాల వ్యాపారం చేస్తున్నారు. పాతబస్తీకి చెందిన అస్లాం అనే యువకుడు మినరల్‌ వాటర్‌సప్లై చేస్తుంటాడు.

బాలిక తల్లిదండ్రులతో పరిచయం పెంచుకున్నాడు. వారి కుమార్తెపై కన్నేసి మాయమాటలు చెప్పి లొంగదీసుకున్నాడు. ఐదారు నెలలుగా బాలికపై అత్యాచారం చేస్తూ వచ్చాడు. గర్భవతి కావడంతో విషయం బయటకు తెలిసింది. నిందితుడికి వివాహమై ఓ కొడుకు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. యువకుడిని అరెస్టు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

English summary
A criminal court here on Friday convicted a 55-year old man who had raped and impregnated his teenage daughter and sentenced him to seven years of rigorous imprisonment. The prosecution and investigation officials had submitted DNA test results to the court as proof.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X