అరుదైన సర్జరీ: 11 రోజుల పసికందు గుండెకు స్టంట్ (ఫోటోలు)
హైదరాబాద్: పుట్టుకతోనే గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న చిన్నారికి అపోలో ఆసుపత్రి వైద్యులు అరుదైన శస్త్రచికిత్సను నిర్వహించారు. 11 రోజుల పసికందు గుండెకు స్టంట్ అమర్చిన అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు.
చిన్నారికి అత్యంత క్లిష్టమైన సర్జరీని విజయవంతంగా పూర్తి చేశామని, ఇలాంటి సర్జరీ చేయడం దేశంలోనే తొలిసారి అని సీనియర్ కన్సల్టెంట్, పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ డాక్టర్ గిరీశ్ వారియర్ తెలిపారు. సోమవారం జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సర్జరీ వివరాలను ఆయన వెల్లడించారు.

అరుదైన సర్జరీ: 11 రోజుల పసికందు గుండెకు స్టంట్
కడప జిల్లా పులివెందులకు చెందిన షహీనా, హుస్సేన్ దంపతులకు సెప్టెంబర్ 3న నెలలు నిండకముందే అబ్బాయి పుట్టాడు.

అరుదైన సర్జరీ: 11 రోజుల పసికందు గుండెకు స్టంట్
గుండెకు, ఉపిరితిత్తుల మధ్య ఉండే ధమని మూసుపోవడంతో పుట్టగానే వెంటిలేటర్ అమర్చాల్సి వచ్చింది. పది రోజుల పాటు చికిత్స అందించి 11వ రోజున బైపాస్ సర్జరీ చేసి గుండె కవాటాన్ని సరిచేశారు.

అరుదైన సర్జరీ: 11 రోజుల పసికందు గుండెకు స్టంట్
దీనికి ముందు గుండెకు ఏర్పడిన రంధ్రాలను ప్యాచ్‌తో మూసివేశారు. ఏడుగంటలకుపైగా సాగిన ఈ సర్జరీ విజయవంతమైంది. ఇలాంటి అరుదైన సమస్య లక్షలాది మందిలో ఒకరిలో వస్తుందని ఆయన పేర్కొన్నారు. అనంతరం పద్నాలుగు రోజుల పాటు బాబును ఐసీయూలో ఉంచి చికిత్స చేశారు.

అరుదైన సర్జరీ: 11 రోజుల పసికందు గుండెకు స్టంట్
ప్రస్తుతం బాబు పూర్తిగా కోలుకున్నట్టు డాక్టర్ గిరీశ్ అన్నారు. ఈ సమావేశంలో వైద్యులు మీనా తెహ్రాన్, షర్మిలా ఖాజా, ప్రమీలా శేఖర్ పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications