కొత్తగూడెంలో అరుదైన పాము: రెండు కాళ్లు, ఎనిమిది గోర్లు!..

Subscribe to Oneindia Telugu

కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ అరుదైన పామును స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది. సాధారణంగా సర్పాలకు కాళ్లు ఉండవనేది అందరికీ తెలిసిన విషయం. కానీ కొత్తగూడెం జిల్లాలో స్థానికులకు కనిపించిన ఓ పాముకు కాళ్లున్నాయి. దీంతో కాళ్లున్న పాము అంటూ ప్రచారం జరగడంతో.. చాలామంది దాన్ని ఆశ్చర్యంగా చూశారు.

కొత్తగూడెం జిల్లా రాంపురానికి చెందిన కొట్ల రాములు అనే రైతు పొలంలో ఆరు ఫీట్లు పొడవున్న ఈ తాచుపాము కనిపించింది. పాముకు శరీరం మధ్యలో కింది భాగాన రెండు కాళ్లు, వాటికి 8గోర్లు ఉన్నాయి. ప్రాణధార ట్రస్ట్ అధ్యక్షుడు సంతోష, ఇతర సిబ్బంది పామును పట్టుకుని డీఎఫ్.వో రాంబాబుకు అప్పగించారు.

rare snake having legs find out in kothagudem

కాళ్లున్న పాము అని స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేసినప్పటికీ.. ఇలాంటి పాములు గతంలోను ఉండేవని వన్యప్రాణి సంరక్షణ అధికారులు చెబుతున్నారు. ఏళ్ల క్రితం ఇలాంటి పాములు ఉండేవని, ఉన్నతాధికారులను సంప్రదించిన తర్వాత మరిన్ని విషయాలు స్పష్టంగా తెలుస్తాయని అన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
In Bhadradri Kothagudem district a rare snake was find out by Forest officials. The snake having two legs and eight nails
Please Wait while comments are loading...